Winter Tips:ఈ గింజలను ఇలా తీసుకుంటే దగ్గు,జలుబు,గొంతు నొప్పి నిమిషంలో మాయం
Sabja Benefits in telugu :వాతావరణం మారింది. వానలు వస్తున్నాయి. సీజన్ మారి వానలు పడుతున్నాయి. వానలు వచ్చాయంటే కామన్ గా దగ్గు,జలుబు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఎన్ని మందులు వాడిన ఒక పట్టాన తగ్గవు. అయితే సబ్జా గింజలతో సులువుగా తగ్గించుకోవచ్చు. సబ్జా దగ్గు,జలుబును తగ్గించడమే కాదు.
గొంతులో మంట,ఆస్తమా,తీవ్రమైన జ్వరం, తలనొప్పి వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. అయితే సబ్జా ఎలా వాడాలో తెలుసుకుందాం. ముందుగా ఒక స్పూన్ సబ్జా గింజలను ఒక గ్లాస్ నీటిలో మూడు గంటల పాటు నానబెట్టాలి. ఆ సబ్జా నీటిలో కొద్దిగా తేనె, అల్లం రసం కలిపి త్రాగాలి. ఈ విధంగా నాలుగు రోజుల పాటు తాగితే దగ్గు,జలుబు నుండి ఉపశమనం కలుగుతుంది.
ఈ సబ్జా నీటిని ఉదయం ప్రతి రోజు తాగితే ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అధిక బరువు,డయబెటిస్,రక్తపోటు అన్నీ నియంత్రణలో ఉంటాయి. సబ్జా గింజలు అందరికీ అందుబాటు ధరలోనే ఉండటమే కాకుండా విరివిగా సంవత్సరం మొత్తం అందుబాటులో ఉంటాయి. ఇంటి చిట్కాలు చాలా బాగా పనిచేస్తాయి.
సబ్జా గింజల్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య నుండి బయట పడటానికి సహాయపడుతుంది.
రోజూ పడుకునే ముందు ఒక గ్లాసు సబ్జా గింజల పానీయం తాగితే మలబద్ధక సమస్య ఉండదు. అంతేకాకుండా శరీరంలో ఉన్న వ్యర్థాలు కూడా బయటికి వేల్లిపోవటమే కాకుండా రక్తం కూడా శుద్ధి అవుతుంది. జీర్ణ సంబంధ సమస్యలైన కడుపు మంట, ఉబ్బరం, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు తొలగిపోతాయి.
పొట్టకు సంబందించిన సమస్యలను తగ్గించటానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సబ్జా గింజల పానీయం తాగితే కడుపు నిండిన భావన కలిగి తొందరగా ఆకలి వేయదు. దీనివల్ల తక్కువగా ఆహారం తీసుకోగలుగుతారు. ఇది డైటింగ్ చేసే వాళ్లకు చాలా ఉపయోగపడుతుంది. సబ్జా గింజల నుంచి అందే కేలరీలు కూడా చాలా తక్కువే. కాబట్టి బరువు తగ్గే ప్రణాళికలో ఉన్నవారు సబ్జా నీటిని తీసుకోవటం అనేది మంచి ఎంపిక అని చెప్పవచ్చు.
మధుమేహంతో బాధపడే వారికి కూడా ఈ పానీయం చాలా మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచటానికి ఈ గింజలలో ఉన్న పైబర్ సహాయ పడుతుంది. మహిళలకు ఫోలేట్, నియాసిన్, విటమిన్ ఇ వంటి పోషకాలు సమృద్దిగా అందుతాయి.
కొబ్బరి నూనెలో సబ్జా గింజల పొడిని కలిపి.. ఆ నూనెను ఎగ్జిమా, సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులు వచ్చినప్పుడు రాస్తే అద్భుతంగా పని చేస్తుంది. సబ్జా విత్తనాలను క్రమం తప్పకుండా తినడం వల్ల కొత్త చర్మ కణాలను రూపొందించడానికి అవసరమైన కొల్లాజెన్‌ను స్రవించడంలో మీ శరీరానికి సహాయపడుతుంది.
ఐరన్, విటమిన్ కె, ప్రొటీన్ సమృద్దిగా ఉండుట వలన జుట్టు పొడవుగా పెరగటమే కాకుండా జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u