Face Glow Tips:శనగపిండితో కలిపి ఇలా చేస్తే ఎంతటి నల్లని ముఖం అయినా తెల్లగా మెరుస్తుంది
Sugar and besan face tips in telugu:ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి పరిస్థితి, కాలుష్యం, సరైన పోషకాహారం తీసుకోకపోవటం వంటి కారణాలతో ముఖం కాంతి తగ్గిపోయి కాంతివిహీనంగా కనపడుతుంది. కేవలం మన వంటగదిలో ఉండే కొన్ని వస్తువులను ఉపయోగించి చాల సులభంగా ముఖం తెల్లగా మెరిసేలా చేసుకోవచ్చు. కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.
అందం కోసం ఎంత ఖర్చు పెట్టటానికి అయినా సిద్దంగా ఉన్నారు. బిజీ జీవనశైలిలో చర్మ సమస్యలు ఎన్నో వస్తున్నాయి. వాటిని తగ్గించుకోవటానికి ఇంటి చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి.
ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి అందం మీద శ్రద్ద పెరిగింది. మనలో ప్రతి ఒక్కరూ అందమైన,కాంతివంతమైన ముఖం కావాలని కోరుకుంటారు. అలా కోరుకోవటం కూడా సహజమే.
దీని కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగి వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం మన ఇంటిలో ఉంటే సహజసిద్దమైన పదార్ధాలతో ముఖాన్ని చాలా తక్కువ ఖర్చుతో మిలమిలా మెరిసేలా చేయవచ్చు.
కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. ఒక బౌల్ లో ఒక స్పూన్ పంచదార,ఒక స్పూన్ శనగపిండి,ఒక స్పూన్ రాగి పిండి,చిటికెడు పసుపు వేసి దానిలో కొబ్బరి నూనె వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి వృత్తాకార మోషన్ లో మసాజ్ చేయాలి. బాగా ఆరాక ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి 2 సార్లు చేస్తే ముఖం మీద పెరుకుపోయిన దుమ్ము,ధూళి తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.
అలాగే ముఖం మీద ఉన్న బ్లాక్ హెడ్స్, నల్లని మచ్చలు అన్నీ తొలగిపోతాయి. కాస్త సమయాన్ని కాస్త శ్రద్ద పెడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖాన్ని మిలమిలా మెరిసేలా చేసుకోవచ్చు. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. శనగపిండి టాన్ రిమూవల్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. చర్మం మిద ఉన్న జిడ్డును తొలగిస్తుంది.
పంచదార చర్మంపై ఉన్న మురికిని తొలగించి సహజ మెరుపును అందిస్తుంది. రాగి పిండి ముఖం కాంతివంతంగా కనిపించేలా చేస్తుంది. చర్మం పై ఉన్న మృత కణాలు దుమ్ము, ధూళి అంతా తొలగిపోతుంది. కాబట్టి ఈ చిట్కాను ఫాలో అయ్యి మొటిమలు, నల్లని మచ్చలు లేకుండా తెల్లని కాంతివంతంగా ఉండే ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు.
ఈ చిట్కా కోసం ఉపయోగించిన పంచదార,శనగపిండి,రాగి పిండి,పసుపు,కొబ్బరి నూనె.. ఇవన్ని ముఖ సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి. చర్మం మీద మృత కణాలను తొలగించి ముఖం మీద మచ్చలు లేకుండా కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. కాబట్టి ఈ చిట్కా ఫాలో అయితే బ్యూటీ పార్లర్ కి వెళ్ళవలసిన అవసరం లేకుండా ముఖాన్ని తెల్లగా మెరిసేలా చేసుకోవచ్చు. కాబట్టి ఫాలో అవ్వండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u