Healthhealth tips in telugu

Warts Removing : పులిపిర్లు పోవాలా.. ఇలా చేయండి..

How to Remove Warts :పులిపిర్లు.. చూడ్డానికి చిన్నగానే కనిపించినా చాలా మంది ఇబ్బందిగా అనిపిస్తుంది. వాటిని తొలగించడానికి కొన్ని ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి. పులిపిరి కాయల సమస్య సాధారణంగా కనిపించే సమస్య. ఇవి కొంత మందికి అందాన్ని ఇస్తే…..మరికొంత మందికి అసహ్యంగా కనపడతాయి. వీటిని పోగొట్టుకోవడానికి చాలా ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. కానీ అవి మంచి ఫలితాలను ఇవ్వవు. ఇప్పుడు కొన్ని చిట్కాల ద్వారా ఈ సమస్య నుండి బయట పడవచ్చు.

పులిపిర్లు.. చిన్న సైజులో వేలాడే కురుపుల్లా ఉండే చాలా ఇబ్బందిగా ఉంటుంది.డయాబెటిస్ ఉన్నవారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కొల్లాజెన్ ఫైబర్స్ వదులుగా మారే పరిస్థితి ఇది. ఇది వయసు ఎక్కువగా ఉన్నవారు, అధిక బరువు ఉన్నవారిలో కనిపిస్తుంది. గజ్జలు, మెడ, కనురెప్పలు, చంకలు, రొమ్ములు, చర్మపు ముడతల దగ్గర కనిపిస్తుంది. ఇది ప్రమాదం కాదు. కానీ, బట్టలు, ఇతరవి ఏమైనా తగిలినప్పుడు నొప్పి, ఇబ్బందిగా అనిపిస్తుంది.

1. విటమిన్ సి పులిపిరి కాయలను పోగొట్టటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. అందువల్ల విటమిన్ సి సమృద్ధిగా లభించే ఉసిరిని పేస్ట్ గా చేసి పులిపిరి కాయల మీద రాయాలి.

2. సున్నంలో అల్లం ముక్కను ముంచి పులిపిరి కాయల మీద రాయాలి. ఈ విధంగా రాసేటప్పుడు పక్కన చర్మానికి అంటకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే సున్నం చర్మం మీద పడితే బొబ్బలు వచ్చే అవకాశం ఉంది.

3. ఆముదాన్ని రాయటం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు.

4. ఉల్లిపాయని మధ్యకు కోసి మధ్య భాగాన్ని తీసేసి దానిలో రాతి ఉప్పు వేసి ఆ రసాన్ని పులిపిరి కాయల మీద రాస్తే తగ్గిపోతాయి. ఈ విధంగా నెల రోజుల పాటు చేయాలి.

5. వెల్లుల్లిలో యాంటీ వైరల్ లక్షణాలు ఉండుట వలన పులిపిరి కాయలను తగ్గించటంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది.

6. అరటి పండు తొక్కతో పులిపిరి కాయలను రుద్దితే తగ్గటమే కాకూండా కొత్తవి కూడా రావు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u