Pineapple Peel:ఫైనాఫిల్ తిని తొక్క పాడేస్తున్నారా…అయితే మిస్ కాకుండా చూడండి
Health Benefits of Pineapple Peel :పండ్ల తొక్కలు టేస్ట్‌గా ఉండదని, దానిపై కెమికల్స్ ఉంటాయని, త్వరగా అరగదని కొన్ని కూరగాయలు, పండ్ల తొక్కలు తీసేసి.. తింటాం. వృథా అంటూ పడేసే ఈ తొక్కలలో ఎన్నో పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
మనలో చాలా మంది ఫైనాఫిల్ ని ముక్కలుగా తినటం,జ్యూస్ గా తాగటం వంటివి చేస్తూ ఉంటారు. ఫైనాఫిల్ తొక్కను పాడేస్తూ ఉంటారు. అయితే మనకు ఫైనాఫిల్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఫైనాఫిల్ తొక్కలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విషయం మనలో చాలా మందికి తెలియదు.
పైనాపిల్ పై తొక్కలో విటమిన్ బీ, ఫోలేట్, థియామిన్, పాంతోతేనిక్ ఆమ్లం, బ్రోమెలైన్, నియాసిన్,మెగ్నీషియం, పొటాషియం, జింక్, మాంగనీస్, కాల్షియం మరియు ఐరన్ వంటివి సమృద్దిగా ఉండుట వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
ఫైనాఫిల్ లో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మంటను తగ్గించటానికి సహాయపడుతుంది. ఫైనాఫిల్ తొక్క చాలా గట్టిగా, రుచిలో కొద్దిగా చేదుగా ఉంటుంది.దీని తొక్కలో బ్రోమాలిన్ అనే ఎంజైమ్ కనిపిస్తుంది. ఇది రక్తం పెరగటానికి సహాయపడుతుంది. జీర్ణక్రియ బాగా జరిగేలా చేస్తుంది.
కాలిన గాయాల మీద ఫైనాఫిల్ తొక్క పెట్టి కట్టు కడితే తొందరగా తగ్గుతాయి. పైనాపిల్ పై తొక్కలో ఉండే బ్రోమాలిన్ గాయాలను నయం చేయటంలో సహాయపడుతుంది.
విటమిన్ సి శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచుతుంది. అలాగే చర్మ వ్యాధులను తగ్గించటానికి సహాయపడుతుంది. పైనాపిల్ పై తొక్కలో బీటా కెరోటిన్ , విటమిన్ సి వంటి పదార్థాలు ఉంటాయి. ఇది కంటి చూపును మెరుగు పరడచానికి సహాయపడుతుంది
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u