Vamu Rasam Recipe: వాము రసం ఇలా చేసి పెట్టండి.. అజీర్తి, కడుపు నొప్పి చిటికెలో తగ్గించండి
Vamu Rasam Recipe:వాము రసం ఇలా చేసి పెట్టండి అజీర్తి, కడుపు నొప్పి చిటికెలో తగ్గించండి.. వాము రసం చాలా రుచిగా ఉండటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఈ రసంతో అన్నం, ఇడ్లీతో తినవచ్చు. ఈ వామురసం తీసుకుంటే పొట్టలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు ఉండవు. తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి పొట్ట తేలిక పడుతుంది.
కావలసిన పదార్ధాలు
వాము చారు పొడికి
1 tsp వాము, 2 ఎండు మిర్చి, 1/2 tsp జీలకర్ర, 1 tsp ధనియాలు
చారు కోసం
1 tsp నూనె, 1 ఎండుమిర్చి, 1 పచ్చిమిర్చి, 5 వెల్లుల్లి రెబ్బలు దంచినవి, 1/2 liter చింతపండు పులుసు (నిమ్మకాయంత చింతపండు నుండి తీసినది), 1/2 tsp ఆవాలు, 1/4 tsp మెంతులు, 2 కరివేపాకు, రాళ్ళ ఉప్పు, 1/4 tsp పసుపు
తయారి విధానం
మిక్సీ జార్ లో 1 tsp వాము, 2 ఎండు మిర్చి, 1/2 tsp జీలకర్ర, 1 tsp ధనియాలు వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. పొయ్యి వెలిగించి మూకుడు పెట్టి ఒక స్పూన్ నూనె వేసి కొంచెం వేడి అయ్యాక మెంతులు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసి వేగించాలి. ఆ తర్వాత చింతపండు పులుసు, పచ్చిమిర్చి, ఉప్పు, కరివేపాకు , పసుపు, వాము పొడి అన్నీ వేసి మీడియం మంట మీద 15 నిమిషాలు పాటు బాగా మరగనివ్వాలి. అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన వాము చారు రెడీ.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u