Cabbage Paratha : లంచ్ బాక్సులకి ఆరోగ్యకరమైన అతి మృదువైన కేబేజి పరాటా..
Cabbage Parata Recipe:లంచ్ బాక్స్ లోకి పర్ఫెక్ట్ అంటే,పరాటాలు, ఆలుతో చేసే పరాటాలు బోర్ కొడితే,క్యాబేజ్ తో ట్రై చేయండి.ఉదయం బ్రేక్ ఫాస్ట్ లేదంటే సాయంత్రం సమయంలో తింటే బాగుంటుంది.
కావాల్సిన పదార్ధాలు
క్యాబేజ్ తురుము – 1కప్పు
ఉప్పు – రుచికి సరిపడా
జీలకర్ర – 1/4టీ స్పూన్
కొత్తిమీర తరుగు – 1 టేబుల్ స్పూన్
వెల్లుల్లి తురుము – 1/2టీ స్పూన్
అల్లం తురుము – 1/2టీ స్పూన్
పచ్చిమిర్చి పేస్ట్ – 1/2టీస్పూన్
కారం – ½ టీ స్పూన్
కరివేపాకు తరుగు – 1టీస్పూన్
నీళ్లు –కొద్దిగా
గోధుమపిండి – 2 కప్పులు
నూనె – తగినంత
తయారీ విధానం
1.క్యాబేజ్ ను ఒక కప్పు తురుముకుని, ఉప్పు, నీళ్లు పిండుకోవాలి.
2.క్యాబేజ్ నుంచి వచ్చిన నీళ్లను పక్కనపెట్టుకోవాలి.
3. పిండిని క్యాబేజి పిప్పిని, ఒక బౌల్ లో వేసుకుని, అందులోకి, మసాలాలు, కారాలు, వేసి,కలుపుకోవాలి.
4.తర్వాత అందులోకి గోధుమపిండి, క్యాబేజ్ను పిండిన నీళ్లు వేసుకుని, కలుపుకోవాలి.
5. అవసరం అయితే మరిన్ని నీళ్లు యాడ్ చేసి, పిండిని మెత్తగా కలుపుకోవాలి.
6.కలుపుకున్న పిండిని, అరగంట సేపు పక్కన ఉంచుకోవాలి.
7.ఇప్పుడు పిండి ముద్దను పొడి పిండిని చల్లుతూ, పరాటాలు చేసుకోవాలి.
8.స్టవ్ పై పెనం పెట్టుకుని, వేడెక్కిన తర్వాత, హై ఫ్లేమ్ పై , పరాఠాలను, కాల్చుకోవాలి.
9.ఒక వైపు కాలిన తర్వాత, నూనె వేసుకుని, మరో వైపు కాల్చుకోవాలి.
10.అంతే క్యాబేజ్ పరాటా రెడీ.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u