Kitchen Hacks:వంటగదిలో పురుగులు, చీమలు ఉన్నాయా? ఈ చిట్కాలతో వాటిని సులభంగా తరిమేయండి
Useful Kitchen Tips : వర్షాకాలం వచ్చేసింది. వానలు ఎక్కువగా కురుస్తున్నాయి. ఈ వానాకాలంలో ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఇంట్లోకి పురుగులు వచ్చేస్తూ ఉంటాయి. ఈ కీటకాల కారణంగా ఎన్నో రకాల చర్మ వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా వంటింట్లోకి పురుగులు, చీమలు,కీటకాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వంటింట్లో నుంచి కీటకాలను, పురుగులను, చీమలను బయటకి పంపడం ఒక పెద్ద సవాలు అని చెప్పవచ్చు.
ఇప్పుడు చెప్పే చిట్కాలను ఫాలో అయితే చాలా సులభంగా పురుగులు, కీటకాలను, చీమలను వంటింటి నుంచి బయటకు తరిమేయొచ్చు . పుదీనా నూనె కీటకాలను, చీమలను తరిమికొట్టడానికి చాలా బాగా సహాయపడుతుంది. నీటిలో పుదీనా నూనెను కలిపి స్ప్రే బాటిల్ లో పోసి వంటింటిలో స్ప్రే చేయాలి.. లేదంటే కాటన్ లో పుదీనా నూనె వేసి వంట గదిలో ఒక ప్రదేశంలో పెడితే ఆ వాసనకు కీటకాలు, పురుగులు, చీమలు రావు.
తులసి ఆకులు కూడా ఇంట్లోనే కీటకాలు తొలగించడానికి సహాయపడతాయి. తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి స్ప్రే బాటిల్లో పోసి కీటకాలు ఉన్న ప్రదేశంలో స్ప్రే చేయాలి. బిర్యాని ఆకులు కూడా కీటకాలను తరిమికొట్టడంలో చాలా ప్రభావంతంగా పనిచేస్తాయి. బిర్యాని ఆకులను కాల్చి పొగ పెట్టొచ్చు.. లేదంటే బిర్యానీ ఆకులను కట్ చేసి కీటకాలు ఉన్న ప్రదేశంలో పెట్టవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u