Kitchenvantalu

Lemon Ginger Rasam Recipe: రుచికరమైన నిమ్మకాయ అల్లం రసం.. ఇలా చేసుకుంటే గ్లాసులో పోసుకొని మరీ తాగేస్తారు

Lemon Ginger Rasam Recipe: గ్రేవీ కర్రీస్, ఫ్రై కర్సీస్ , చెట్నీస్, ఎన్ని వెరైటీస్ చేసినా, ప్రతి రోజూ, మన లంచ్ మెనూలో, మ్యాక్సిమమ్ రసం ఉండాల్సిందే.
ఒక రెండు ముద్దలు రసంతో లాగిస్తే, ఆ తృప్తే పేరు. అయితే ఇంకెందుకు ఆలస్యం, అల్లం నిమ్మరసంతో వేడి వేడి రసం చేసేద్దాం.

ఈ రసాన్ని మనం సాధారణంగా పప్పు, మిరియాలు, చింతపండు నీళ్లు కలిపి పలుచటి సూప్ లాగా చేసుకుంటాం. అయితే ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది, ఈ సీజన్ లో మనం వేడివేడిగా అల్లం టీని ఆస్వాదిస్తూ ఉంటాం. అలాగే ఇదే తరహాలో అల్లం రసంను ట్రై చేస్తే చాలా రుచిగా అద్భుతంగా ఉంటుంది.

సాదారణంగా సీజన్ మారినప్పుడు ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. దగ్గు, జలుబు లేదా ఫ్లూలకి ఒక సాంప్రదాయ ఔషధంలా కూడా పనిచేస్తుంది. ఈ రసంలో యాంటీఆక్సిడెంట్లు ఉండటం వలన రోగనిరోధక శక్తిని పెంచుతుంది, జీర్ణ వ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. అటువంటి గుణాలు కలిగిన, రుచికరమైన నిమ్మకాయ అల్లం రసం ఎలా చేయాలో వివరంగా తెలుసుకుందాం.

కావాల్సిన పదార్ధాలు
ఎర్రపప్పు – 1/2 కప్పు
కరివేపాకు – 6 రెమ్మలు
టమాట -1
పసుపు – చిటికెడు
బ్లాక్ పెప్పర్ – 1 టీ స్పూన్
అల్లం – 1 ఇంచ్
వెల్లుల్లి రెబ్బలు -5
జీలకర్ర – 1 స్పూన్
రాక్ సాల్ట్ – రుచికి సరిపడా
నిమ్మరసం -3 టేబుల్ స్పూన్స్
కొత్తిమీర -1 చిన్న కట్ట
నూనె – 1 టేబుల్ స్పూన్
ఆవాలు – 1/2టీ స్పూన్
మెంతులు – 2 చిటికెలు
ఎండుమిర్చి -2
ఇంగువ – చిటికెడు
కరివేపాకు – రెండు రెమ్మలు

తయారీ విధానం
1.ఒక కుక్కర్ లోకి నానపెట్టిన, ఎర్రపప్పు,పసుపు, కరివేపాకు, వేసి తగినన్ని నీళ్లుపోసి, మీడియం ఫ్లేమ్ పై నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
2. ఇప్పుడు ఉడికించిన పప్పును, మెత్తగా చేసుకుని, అందులో ఉన్న నీటిని వడకట్టుకోవాలి.
3. ఇప్పుడు రసం పొడి కోసం అల్లం, వెల్లుల్లి, ధనియాలు, మిరియాలు, వేసుకుని మెత్తగా పౌడర్ గా గ్రైండ్ చేసుకోవాలి.

4. ఇప్పుడు వడకట్టుకున్న రసంలోకి, గ్రైండ్ చేసుకున్న మసాలాను ఉప్పు వేసి, మీడియం మంట మీద, మరిగించి, స్టవ్ ఆఫ్ చేసి, నిమ్మరసం, కొత్తిమీరను కలుపుకోవాలి.
5. చివరగా ఇంకో పాన్ పెట్టుకుని, కొద్దిగా ఆయిల్ వేసుకుని, అందులోకి ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు మరియు ఇంగువ వేసుకుని వేగిన పోపును రసంలోకి కలుపుకోవాలి.
6. అంతే వేడి వేడి అల్లం రసం రెడీ. దీనిని వారంలో కనీసం రెండు సార్లు చేసుకొని తింటే మంచిది. ఏ సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u