Rice storage: ఈ టిప్స్ ఫాలో అయితే.. బియ్యం పురుగులు పట్టవు..
Biyyamlo Purugulu:ప్రతి రోజు అన్నం తింటూ ఉంటాం. కాబట్టి బియ్యం రేటు తక్కువ ఉన్నప్పుడు ఎక్కువగా కొని నిల్వ చేస్తూ ఉంటాం. బియ్యాన్ని రెండు, మూడు నెలకు సరిపడేలా లేదా ఆరు నెలలకు సరిపడా కొనుగోలుచేసి నిల్వ చేసుకుంటుంటారు మనలోని చాలా మంది. ఇలా బియ్యం నిల్వ ఉంచుకోవడం మంచిదే. కానీ నిల్వ చేసుకుంటున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా తప్పనిసరి.
ఎందుకంటే నిల్వ చేసిన బియ్యంలో పురుగులు పడుతుంటాయి. ఈ పురుగులు విసర్జంచే వ్యర్థాలు, మలినాలు బియ్యంలో అలానే ఉండిపోతాయి. ఇలా పురుగులు పట్టిన బియ్యం తినడం వల్ల అనేక జీర్ణ సంబంధిత రోగాలు వస్తాయి. అందుకే మనం బియ్యంలో పురుగులు పట్టకుండా నిల్వ చేసుకోవడం చాలా అవసరం.
ప్రస్తుతం వానలు ఎక్కువగా పడుతున్నాయి. ఈ సమయంలో బియ్యం పురుగు పట్టకుండా చూసుకోవటం పెద్ద సవాలు అనే చెప్పాలి. వర్షాకాలంలో తేమ చాలా పెరుగుతుంది. దీని కారణంగా కీటకాలు కూడా మూసివున్న వస్తువులలోకి చేరిపోతాయి. ఇలాంటప్పుడు మన ఇంట్లో నిల్వ చేసినవి చెడిపోతుంటాయి. మూసి ఉంచిన బియ్యంలో కూడా పురుగులు మొదలవుతాయి.
అటువంటి పరిస్థితిలో, బియ్యం శుభ్రం చేయడం చాలా కష్టం అవుతుంది. అన్నం వండేటప్పుడు పురుగుల భయం అలాగే ఉంటుంది. ఇక్కడ కొన్ని సులభమైన చిట్కాలను అనుసరిస్తే బియ్యంలోకి పురుగులు చేరకుండా చూసుకోవచ్చు.
ఒక్కోసారి బియ్యం ఎక్కువగా కొనేస్తూ ఉంటాం. అలాంటప్పుడు బియ్యం పురుగు పడుతుంది. ఈ సమస్య చాలా మందికి ఉంటుంది. ఈ సమస్యకు సులువైన చిట్కా ఉంది. అది ఏమిటంటే వేపాకులను ఎండబెట్టి పొడి చేసి మూట కట్టి బియ్యంలో వేయాలి. వేపాకులలో యాంటీ సెప్టిక్ గుణాలు ఉండుట వలన పురుగులు బియ్యంలోకి చేరవు.
ఇంగువ ముక్కలను లేదా పొడిని చిన్న చిన్న మూటలుగా కట్టి బియ్యం డబ్బాలో వేయాలి.ఇంగువ ఘాటు కారణంగా బియ్యానికి పురుగు పట్టదు. వెల్లుల్లి రెబ్బల పొట్టు తీసి బియ్యంలో ఉంచడం వల్ల బియ్యం పురుగు పట్టకుండా ఉంటుంది.
బియ్యం పురుగుపట్టకుండా చేయడంలో లవంగాలు సమర్థవంతంగా పని చేస్తాయి. బియ్యంలో లవంగాలను ఉంచడం వల్ల లేదా లవంగాల పొడిని వస్త్రంలో కట్టి బియ్యంలో ఉంచడం వల్ల కూడా పురుగు పట్టకుండా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు చెప్పిన చిట్కాలు అన్ని సమర్ధవంతంగా పనిచేస్తాయి. మీరు లభ్యం అయినా వస్తువులను బట్టి ఏ చిట్కా ఫాలో అవ్వాలో ఆలోచించుకోండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ