Healthhealth tips in telugu

Sonthi Benefits:ఈ పొడిలో ఉన్న ఈ రహస్యం తెలిస్తే అసలు వదిలిపెట్టరు..ఇది నిజం…

Sonthi Health benefits In Telugu :వర్షాకాలం శొంఠి ఇంట్లో వుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వర్షాకాలంలో జలుబు, దగ్గు, జీర్ణ సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడతూ ఉంటాయి. సీజ‌న‌ల్ వ్యాధుల‌ను తగ్గించటంలో శొంఠి అద్భుతంగా పనిచేస్తుంది. శొంఠి మన డైట్‌లో చేర్చుకుంటే. మన ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేద నిపుణులు చెప్పుతున్నారు.

శొంఠి పొడిని ప్రతి రోజు పావు స్పూన్ తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. శొంఠి పొడి మార్కెట్ లో లభ్యం అవుతుంది. కానీ ఇంటిలో తయారు చేసుకుంటేనే మంచిది. శొంఠి కొమ్ములను తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టి ముక్కలుగా చేసి నూనె లేదా నెయ్యిలో వెగించి చల్లారాక పొడిగా చేసుకోవాలి.

ఈ పొడిని మధ్యాహ్నం భోజనం సమయంలో అన్నంలో కలుపుకొని మొదటి ముద్దగా తినవచ్చు. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో పావు స్పూన్ శొంఠి కలిపి తాగితే సరిపోతుంది. ఈ విధంగా శొంఠి పొడి తీసుకోవటం వలన కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. శరీరంలో అదనంగా ఉన్న గ్యాస్ ని తొలగిస్తుంది. ఒక వేళ శరీరంలో గ్యాస్ ఎక్కువగా ఉంటే ఆ గ్యాస్ కీళ్ల మధ్యకు చేరి కీళ్ల నొప్పులకు కారణం అవుతుంది.

గ్యాస్,కడుపు ఉబ్బరం,మలబద్దకం,అజీర్ణం వంటి సమస్యలకు మంచి పరిష్కారంగా చెప్పవచ్చు. గ్యాస్ సమస్య వచ్చినప్పుడు బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ బాధ నుండి బయట పడేయటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

శొంఠి పొడి క్రమం తప్పకుండా మీ డైట్‌లో చేర్చుకుంటే.. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శొంఠిలో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. మలబద్ధకం వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు శొంఠి సహాయపడుతుంది.

డయబెటిస్ ఉన్నవారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. బరువు టాగ్గాలని అనుకొనేవారికి కూడా ఒక మంచి ఎంపిక అని చెప్పవచ్చు. శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించటమే కాకుండా తొందరగా ఆకలి వేయకుండా చేస్తుంది.

శొంఠి చెడు కొలెస్ట్రాల్ , ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.అలాగే రక్తప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. కాబట్టి ప్రతి రోజు పావు స్పూన్ శొంఠి పొడి తినటానికి ప్రయత్నం చేయండి. శొంఠిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శొంఠి కఫాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. శొంఠి నీరు తీసుకుంటే జలుబు, దగ్గు దూరమవుతాయి.

కాబట్టి ప్రతి రోజు శొంఠి పొడిని తీసుకోని ఈ సీజన్ లో ఈ సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండండి. శొంఠి పొడిని చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ ఎటువంటి అనుమానం లేకుండా తీసుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u