Weight Loss:రోజుకి 1 గ్లాస్ అధిక బరువు ,బొడ్డు కొవ్వు,శరీరంలో ఉన్న కొవ్వు మొత్తం కరిగిస్తుంది
Weight Loss Tips In Telugu In one week :ఇప్పుడు చెప్పే ఈ డ్రింక్ శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించటానికి మరియు బరువు తగ్గటానికి సహాయపడుతుంది. ఈ రోజుల్లో అధిక బరువు సమస్య అనేది చాలా ఎక్కువ అయింది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువును తగ్గించుకోవటానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా పెద్దగా ఫలితాన్ని ఇవ్వవు.
మనలో చాలా మంది వేల కొద్ది డబ్బును ఖర్చు పెడుతూ ఉంటారు. మార్కెట్ లో దొరికే ఎన్నో రకాల ప్రొడక్ట్స్ ని వాడుతూ ఉంటారు. అయినా ఫలితం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. అలా కాకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా అధిక బరువు సమస్య నుండి బయట పడవచ్చు.
అయితే మంచి పోషకాహారం తీసుకుంటూ రెగ్యులర్ గా వ్యాయామం చేస్తూ ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగితే కచ్చితంగా అధిక బరువు సమస్య నుండి చాలా ఈజీగా బయటపడవచ్చు. ఈ డ్రింక్ తాగడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీర్ణప్రక్రియ బాగుంటే తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి కొవ్వుగా మారకుండా శక్తిగా మారుతుంది.
ఒక స్పూన్ ధనియాలు,ఒక స్పూన్ జీలకర్ర,4 రెబ్బల కరివేపాకు ఆకులను నూనె లేకుండా వెగించి పొడి చేసుకోవాలి. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ పొడిని వేసి బాగా కలిపి ప్రతి రోజు ఉదయం పరగడుపున తాగాలి. ఈ విధంగా నెల రోజుల పాటు చేస్తే దాదాపుగా 5 కేజీల బరువు తగ్గవచ్చు.
అధిక బరువుతో బాధపడుతున్న వారు ప్రతి రోజు వ్యాయామం చేస్తూ ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. ధనియాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ధనియాలలో బయో యాక్టివ్ సమ్మేళనాలు అధికంగా ఉండుట వలన ఆరోగ్యాన్ని అందిస్తూనే బరువును తగ్గించేందుకు సహాయపడతాయి.
ముఖ్యంగా ధనియాలతో చేసిన ఆహారాన్ని తినడం వల్ల ఆకలి తక్కువగా వేస్తుంది. దీనివల్ల మీరు ఆహారం తక్కువగా తింటారు. అది కూడా తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తినాలనిపిస్తుంది. తద్వారా బరువు తగ్గడం సులువుగా మారుతుంది.
జీలకర్ర మీ జీర్ణవ్యవస్థకు సహాయపడుతుంది మరియు మీరు ఆరోగ్యకరమైన ప్రేగును నిర్వహించడానికి సహాయపడుతుంది.శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించేందుకు జీలకర్ర ఉపయోగపడుతుంది. జీలకర్ర గింజలు కొవ్వు తగ్గింపు మరియు బరువు తగ్గడానికి ప్రయోజనకరంగా ఉంటాయి.
ఇది శరీరంలోని మెటబాలిజాన్ని వేగవంతం చేసి, కొవ్వు కరిగే ప్రక్రియను ప్రోత్సహిస్తుంది. జీలకర్ర నీటిలో ఉండే డైయూరిటిక్ గుణాలు శరీరంలోని ఆవసరంలేని నీటిని మరియు టాక్సిన్లను తొలగిస్తాయి, తద్వారా శరీర బరువు తగ్గడంలో సహాయపడతాయి.
కరివేపాకు శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించి బరువు తగ్గటానికి సహాయపడటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కాబట్టి ఈ డ్రింక్ తాగి అధిక బరువు సమస్యకు చెక్ పెట్టండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u