Kitchenvantalu

Masala Egg Rice:కేవలం 10 నిమషాల్లో సింపుల్ గా ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్ తో ఎగ్ రైస్ ని చేసేయండి

Masala Egg Rice:కేవలం 10 నిమషాల్లో సింపుల్ గా ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్ తో ఎగ్ రైస్ ని చేసేయండి.. పిల్లలకైనా ,పెద్ద వాళ్ళకైన లంచ్ బాక్స్ లోకి ఫ్రైడ్ రైస్,ఎగ్ రైస్ చెయ్యాడానికి తినడానికి ఈజీగా ఉంటుంది.ఉడుక పెట్టిన ఎగ్ తో మసాలా ఎగ్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
వండిన అన్నం – 3 కప్పులు
బటర్ – 1 ½ టేబుల్ స్పూన్
నూనె – 1 టీ స్పూన్
జీలకర్ర – ½ టీ స్పూన్
వెల్లుల్లి తరుగు – 1 స్పూన్
ఉల్లిపాయ – 1
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్
పసుపు – ¼ టీ స్పూన్
కరివేపాకు – 2 రెమ్మలు
టొమాటోలు – 2
కారం – 1 టీ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
మెంతి పొడి – 1 టీ స్పూన్
గరం మసాలా – ¼ టీ స్పూన్
ఉడికించిన గుడ్లు – 4
పెప్పర్ పౌడర్ – ½ టీ స్పూన్
కొత్తిమీర – 3 టేబుల్ స్పూన్

తయారీ విధానం
1.మూడు కప్పుల వండిన అన్నం పక్కన పెట్టుకోవాలి.
2.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని ఆయిల్ ,బటర్ వేసి వేడి చేయాలి.
3.వేడెక్కిన నూనెలోకి జీలకర్ర ,వెల్లుల్లి వేసి వేగనివ్వాలి.
4.ఇప్పుడు అందులోకి ఉల్లిపాయలు వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపుకోవాలి.

5. అందులోకి పచ్చిమిర్చి ,సన్నగా తరిగిన టమాటోలు ,కొత్తిమీర వేసి మగ్గనివ్వాలి.
6. టమాట మగ్గిన తర్వాత ఉడికించిన గుడ్లను యాడ్ చేసుకోని కూర దగ్గర పడనివ్వాలి.
7.ఇప్పుడు అందులోకి పెప్పర్ పౌడర్ ,ఉప్పు వేసి ఎగ్స్ ని రెండు బాగాలుగా కట్ చేసుకోవాలి.
8.ఇప్పుడు అందులోకి ఉడికించిన అన్నం వేసి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మసాల ఎగ్ రైస్ రెడీ.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ