Jaggery With Sprouted Chana :మొలకెత్తిన శనగలు, బెల్లం కలిపి తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Jaggery With Sprouted Chana :మొలకెత్తిన శనగలు, బెల్లం కలిపి తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. మొలకెత్తిన శనగలు,బెల్లం కలిపి తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. శరీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో శరీరంలో రోగనిరోదక వ్యవస్థ బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. రోగనిరోదక వ్యవస్థ బలంగా ఉంటే ఎటువంటి వ్యాధులు రావు.
మొలకెత్తిన శనగలు,బెల్లం కలిపి తిన్నప్పుడు విటమిన్లు ఖనిజాలతో నిండిన పోషకాహారం అవుతుంది. బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటుంది. మొలకెత్తిన శనగల్లో ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది. బెల్లంలో జింక్, సెలీనియంలు ఎక్కువగా ఉంటాయి. మొలకెత్తిన శనగలలో విటమిన్ బి6, విటమిన్ సి, ఫోలేట్, నియాసిన్, థియామిన్, రిబోఫ్లేవిన్, మాంగనీస్, ఐరన్ ఇలా ఎన్నో విటమిన్స్ ఉంటాయి.
బెల్లంలో ఐరన్, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. రక్తహీనత సమస్య లేకుండా చేస్తాయి. ముదురు రంగులో ఉన్న బెల్లంను వాడాలి. ఒక రకంగా చెప్పాలంటే ముదురు రంగులో ఉన్న బెల్లం ఆర్గానిక్ బెల్లం. కెమికల్ వేసిన బెల్లం పసుపు రంగులో ఉంటుంది. ఆర్గానిక్ బెల్లం వాడటానికి ప్రయత్నం చేయండి.
మొలకెత్తిన శనగలు, బెల్లం కలిపి తీసుకున్నప్పుడు కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది, ఎందుకంటే శనగల్లో ప్రోటీన్ సమృద్దిగా ఉంటుంది. ఇది కండరాల ఆరోగ్యానికి మంచిది. బెల్లంలో ఉండే పొటాషియం కండరాలను నిర్మించడంలో మరియు జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. అందువల్ల శనగలు, బెల్లం కలిపి తీసుకున్నప్పుడు అధిక బరువు సమస్యను తగ్గించటానికి కూడా సహాయపడుతుంది.
జీవక్రియలు బాగా జరిగేలా చేస్తుంది. తీసుకున్న ఆహారం బాగా జీర్ణం కావటానికి జీర్ణ ఎంజైమ్‌లను సక్రియం చేసి ప్రేగు కదలికలను ప్రేరేపిస్తుంది. దాంతో మలబద్దకం సమస్య కూడా తగ్గుతుంది. మెదడు కార్యాచరణను మెరుగుపరచి జ్ణాపకశక్తి సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం, రక్తప్రసరణ సరిగా జరిగేలా చేసి గుండెకు ఎలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ