Flax Seeds:ఈ గింజలను ఇలా తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గి బరువు తగ్గుతారు.. కేవలం స్పూన్ చాలు
Flax Seeds Benefits: ఈ రోజుల్లో అవిసె గింజలు తినమని డాక్టర్లు సలహాలు ఇస్తున్నారు. ప్రజలు కూడా ఈ గింజలు తింటే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారు. ఐతే, ఇవి చప్పగా ఉంటాయని ఆసక్తి చూపట్లేదు. మీరు రోజూ అవిసె గింజలు తింటే, మీ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకుందాం.
మన శరీరంలో రక్తప్రసరణ సరిగ్గా జరిగితే ఎటువంటి సమస్యలు ఉండవు. రక్తప్రసరణ ఒక్క అవయవానికి అందకపోయిన ఆ అవయవం పనితీరు ఆగిపోతుంది. శరీరంలో రక్తప్రసరణ సరిగ్గా జరగకపోవటానికి అనేక రకాల కారణాలు ఉంటాయి. వాటిలో కొలెస్ట్రాల్ ఒకటి. చెడు కొలెస్ట్రాల్ అనేది రక్త ప్రవాహానికి అడ్డుపడుతుంది.
ముఖ్యంగా గుండెకు,మెదడుకు రక్త ప్రవాహం సరిగ్గా జరగకపోతే ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఒమేగా 3 ఫ్యాటి యాసిడ్స్ సమృద్దిగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటి యాసిడ్స్ అనేవి అవిసె గింజలలో సమృద్దిగా ఉంటాయి. చాలా తక్కువ ఖర్చుతో మంచి పోషకాలను మన శరీరానికి అందిస్తుంది.
రక్తపోటు,కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండేలా చేసి రక్తంలో ఉన్న బ్లాకేజ్ లను తొలగించి బ్రెయిన్ స్ట్రోక్,హార్ట్ స్ట్రోక్, పెరాలసిస్ వంటివి రాకుండా కాపాడుతుంది. అవిసె గింజలను రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తినవచ్చు. లేదా పేస్ట్ చేసి కూరల్లో వేసుకోవచ్చు. లేదా ఖర్జూరంతో కలిపి లడ్డు వలె చేసుకొని తినవచ్చు.
అవిసె గింజలను దోరగా వేగించి పొడి చేసుకోవాలి. ఆ తర్వాత మెత్తని ఖర్జూరం తీసుకొని గింజలు తీసేసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఖర్జూరం పేస్ట్ లో అవిసె గింజల పొడి కలిపి లడ్డూలు చేసుకొని రోజుకి ఒకటి చొప్పున తినాలి. ఇలాంటి ఆహారాలను తీసుకుంటూ ఉంటే ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటాం.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ