Pot Water:ఫ్రిజ్ వదిలేసి.. నెల రోజుల పాటు మట్టి కుండలో నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?
ఫ్రిజ్ వదిలేసి.. నెల రోజుల పాటు మట్టి కుండలో నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా..వేసవి రాగానే చల్లటి నీళ్ల కోసం ఫ్రిజ్ వైపు పరుగులు తీయడం మనకు అలవాటు. కానీ, ఫ్రిజ్ నీళ్లు మన ఆరోగ్యంతో పాటు పర్యావరణానికి కూడా ఎంత హాని చేస్తున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అదే మన తాత ముత్తాతలు వాడిన ‘మట్టి కుండ’ను వాడితే శరీరంలో అద్భుతమైన మార్పులు జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం.
ఫ్రిజ్ నీళ్లతో ముప్పు ఎందుకు?
ఫ్రిజ్ వాడటం వల్ల కేవలం కరెంటు బిల్లు పెరగడమే కాదు, పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుంది. ఫ్రిజ్ నుంచి వెలువడే హానికారక వాయువులు ఓజోన్ పొరకు ముప్పుగా మారుతున్నాయి. ఇక ఆరోగ్యపరంగా చూస్తే.. అతి చల్లటి ఫ్రిజ్ నీళ్లు తాగడం వల్ల గొంతు ఇన్ఫెక్షన్లు, సైనస్, అలర్జీలు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ.
మట్టి కుండ నీరు త్రాగడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు:
మీరు కనుక ఒక నెల రోజుల పాటు ఫ్రిజ్ నీళ్లు మానేసి, మట్టి కుండలో నీళ్లు తాగడం మొదలుపెడితే మీ ఆరోగ్యానికి ఈ కింది లాభాలు చేకూరుతాయి:
సహజమైన చల్లదనం: ఫ్రిజ్ నీళ్లలా కాకుండా, మట్టి కుండ నీరు గొంతుకు హాని చేయకుండా శరీరానికి అవసరమైన ‘సమతూకమైన చల్లదనాన్ని’ అందిస్తుంది.
ఖనిజాల (Minerals) భర్తీ: ఎండలో చెమట ద్వారా మనం కోల్పోయే ముఖ్యమైన లవణాలను మట్టి కుండ నీరు శరీరానికి తిరిగి అందిస్తుంది. దీనివల్ల కిడ్నీలు మరియు మెదడు చాలా చురుగ్గా పనిచేస్తాయి.
వ్యాధినిరోధక శక్తి (Immunity): మట్టిలో సహజంగా ఉండే కొన్ని ప్రో-బ్యాక్టీరియాలు నీటి ద్వారా మన శరీరంలోకి చేరి రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. ఇవి హానికారక యాంటీ బాడీస్‌పై పోరాడి, వందల రకాల వ్యాధులను ప్రారంభ దశలోనే తుంచివేస్తాయి.
సహజ ఫిల్టర్: మట్టి కుండ నీటిలోని మలినాలను గ్రహించి, మనకు స్వచ్ఛమైన నీటిని అందిస్తుంది.
చివరి మాట: మన శరీరంలో వచ్చే 40 శాతం అనారోగ్యాలకు మనం తాగే నీరే కారణం అని వైద్యులు చెబుతారు. నీటి విషయంలో తీసుకునే చిన్న జాగ్రత్త మిమ్మల్ని పెద్ద పెద్ద రోగాల నుంచి కాపాడుతుంది. అందుకే, ఈ రోజే ఒక మట్టి కుండను తెచ్చుకోండి.. ఆరోగ్యకరమైన జీవితాన్ని సొంతం చేసుకోండి!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

