జస్ట్ రూ. 16 వేలకే అయోధ్య, కాశీ, వైష్ణోదేవి యాత్ర.. ఐఆర్‌సీటీసీ వేసవి బంపర్ ఆఫర్, ఫుల్ డీటెయిల్స్ ఇవే!
జస్ట్ రూ. 16 వేలకే అయోధ్య, కాశీ, వైష్ణోదేవి యాత్ర.. ఐఆర్‌సీటీసీ వేసవి బంపర్ ఆఫర్, ఫుల్ డీటెయిల్స్ ఇవే! వేసవి సెలవుల్లో కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకునే వారికి దక్షిణ మధ్య రైల్వే అదిరిపోయే శుభవార్త చెప్పింది. తెలుగు రాష్ట్రాల భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ (IRCTC) ‘భారత్ గౌరవ్’ ప్రత్యేక టూరిస్ట్ రైళ్లను ప్రకటించింది. ప్రయాణం, భోజనం, వసతి అన్నీ కలిపి అతి తక్కువ ధరకే ఈ అద్భుతమైన ప్యాకేజీలను అందిస్తోంది.
ఏప్రిల్ 14 నుంచి జూన్ 12 వరకు నడిచే ఈ ప్రత్యేక రైళ్ల ద్వారా అయోధ్య, కాశీ, వైష్ణోదేవి, రామేశ్వరం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను చుట్టిరావచ్చు. ప్యాకేజీల పూర్తి వివరాలు మీకోసం..
1. అయోధ్య – కాశీ దివ్య యాత్ర (ఫుల్ డిమాండ్)
తేదీలు: ఏప్రిల్ 28 నుంచి మే 7 వరకు.
దర్శించే ప్రదేశాలు: పూరి, కోణార్క్, వైద్యనాథ్ ధామ్, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్.
టికెట్ ధరలు: స్లీపర్ క్లాస్ రూ.16,700 | 3AC రూ.26,100 | 2AC రూ.34,100.
ఎక్కాల్సిన స్టేషన్లు: సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, తుని, విజయనగరం.
2. హరిద్వార్ – మాతా వైష్ణో దేవి – రిషికేశ్ యాత్ర
తేదీలు: మే 12 నుంచి 21 వరకు.
దర్శించే ప్రదేశాలు: మధుర, బృందావనం, వైష్ణో దేవి, హరిద్వార్, రిషికేశ్.
టికెట్ ధరలు: స్లీపర్ క్లాస్ రూ.16,500 | 3AC రూ.25,700.
ప్రయాణ మార్గం: సికింద్రాబాద్ నుంచి బయలుదేరి తెలంగాణ, మహారాష్ట్రల మీదుగా ఉత్తర భారతాన్ని చేరుకుంటుంది.
3. దక్షిణ భారత పుణ్యక్షేత్రాల యాత్ర (అరుణాచలం – చిదంబరం)
తేదీలు: మే 24 నుంచి 31 వరకు.
దర్శించే ప్రదేశాలు: తిరువన్నామలై, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, తిరుచ్చి, తంజావూరు, చిదంబరం.
టికెట్ ధరలు: స్లీపర్ క్లాస్ రూ.14,500 | 3AC రూ.21,700 | 2AC రూ.27,900.
ఎక్కాల్సిన స్టేషన్లు: సికింద్రాబాద్, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట.
4. యమునా పుష్కరాల స్పెషల్ (అయోధ్య – కాశీ)
తేదీలు: జూన్ 3 నుంచి 12 వరకు.
దర్శించే ప్రదేశాలు: పూరి, కోణార్క్, వైద్యనాథ్ ధామ్, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్.
ధరలు: మొదటి ప్యాకేజీ మాదిరిగానే ఉంటాయి.
ప్యాకేజీలో ఏమేం కవర్ అవుతాయి?
ఈ టూర్ ప్యాకేజీలో కేవలం రైలు ప్రయాణం మాత్రమే కాదు.. రాత్రి బస చేయడానికి వసతి, ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు, పుణ్యక్షేత్రాల వద్ద సైట్ సీయింగ్ కోసం ప్రత్యేక వాహన సదుపాయం, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటివి అన్నీ కవర్ అవుతాయి. భక్తులు అదనంగా ఖర్చు చేయాల్సిన అవసరం పెద్దగా ఉండదు.
బుకింగ్ ఎలా చేసుకోవాలి?
అయోధ్య, కాశీ యాత్రలకు పర్యాటకుల నుంచి భారీ స్పందన వస్తుండటంతో టికెట్లు త్వరగా అమ్ముడవుతున్నాయి. ఆసక్తి గల భక్తులు IRCTC అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఏవైనా సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ/హెల్ప్‌లైన్ నంబర్లు 9701360701, 9281030727 లను సంప్రదించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీ సమ్మర్ ట్రిప్‌ను వెంటనే ప్లాన్ చేసుకోండి!
గమనిక:ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

