రాత్రి పూట అరటిపండు తింటున్నారా? అయితే ఈ షాకింగ్ నిజాలు అస్సలు మిస్ అవ్వకండి!
అరటిపండు అనేది చాలా చవకగా సంవత్సరం పొడవునా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే ఒక పండు. అరటిపండు లో ఉండే పోషకాలు మన శరీరానికి ఎన్నో రకాలుగా సహాయపడుతుంది.
అరటి పండులో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థలోని సమస్యలను తగ్గిస్తుంది. అరటి పండులో పొటాషియం, విటమిన్ b6, మెగ్నీషియం, కాపర్, మాంగనీస్ వంటి పాషకాలు చాలా సమృద్ధిగా ఉంటాయి.

రాత్రి సమయంలో అరటిపండు తినవచ్చా అనే విషయానికొచ్చేసరికి.. రాత్రి సమయంలో అరటిపండు తినవచ్చు అయితే కొన్ని సమస్యలు ఉన్నవారు మాత్రం దూరంగా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే అరటిపండు జీర్ణం కావడానికి కొంత సమయం పడుతుంది. ఇది మలబద్దకం సమస్యను పెంచుతుంది. అందుకే అరటిపండు రాత్రి సమయంలో కంటే పగటిపూట తినడమే ఉత్తమం అని చెప్పవచ్చు.

దంతాలకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు అరటి పండ్లను తినకూడదు. అలాగే మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్న వారు కూడా అరటిపండుకు దూరంగా ఉంటేనే మంచిది. డయాబెటిస్ ఉన్నవారు కూడా అరటిపండును తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి.
రాత్రి తింటే జీర్ణక్రియ మందగిస్తుందని, కఫం (జలుబు) చేసే అవకాశం ఉంది. కానీ అందులో ఉండే మెగ్నీషియం వల్ల రాత్రి పూట మంచి నిద్ర పడుతుంది.
ఇవి కూడా చదవండి:
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

