Kitchen Tips: వంటింట్లో ఈ 6 మ్యాజిక్ చిట్కాలు తెలిస్తే.. మీ వంట పని సగం తగ్గిపోతుంది,
రోజువారీ జీవితంలో గృహిణులకు వంటింట్లోనే ఎక్కువ సమయం గడిచిపోతుంది. వంట త్వరగా అవ్వాలన్నా, చేసిన వంటకం మరింత రుచిగా మారాలన్నా కొన్ని చిన్న చిన్న చిట్కాలు (Kitchen Tips) ఎంతగానో ఉపయోగపడతాయి.
ఇవి సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, వంట గదిలోని వస్తువులు వృధా కాకుండా చూస్తాయి. మరి ఇల్లాళ్లకు స్మార్ట్ వర్క్‌లా ఉపయోగపడే ఆ అద్భుతమైన వంటింటి చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం…
1. కాకరకాయ చేదు తగ్గాలంటే ఇలా చేయండి!
మనలో చాలా మంది కాకరకాయ ఆరోగ్యానికి మంచిదని తెలిసినా, అది చేదుగా ఉంటుందని తినడానికి ఇష్టపడరు. అయితే, కాకరకాయ కూర లేదా ఫ్రై చేసేటప్పుడు అందులో కొద్దిగా సోంపు గింజలు, చిన్న బెల్లం ముక్క వేసి వండండి. ఇవి కాకరకాయలోని చేదును పూర్తిగా లాగేసి, కూరకు మంచి రుచిని ఇస్తాయి.

2. అప్పడాలు నూనె ఎక్కువ పీల్చకుండా ఉండాలంటే..
సాధారణంగా అప్పడాలు వేయించేటప్పుడు నూనె ఎక్కువగా లాగేస్తూ ఉంటాయి. అలా జరగకుండా ఉండాలంటే, అప్పడాలను నూనెలో వేయించడానికి సరిగ్గా పది నిమిషాల ముందు ఎండలో పెట్టండి. ఇలా చేయడం వల్ల అవి నూనెను తక్కువగా పీల్చుకుని, కరకరలాడుతూ వస్తాయి.
వేలకు వేలు ఖర్చు అవసరం లేదు.. మీ ఇంట్లో ఉండే ఈ 3 వస్తువులతో ముఖాన్ని తెల్లగా మార్చుకోండి!
3. గోధుమ పిండి చిప్స్ క్రిస్పీగా రావాలంటే..
మైదా పిండి ఆరోగ్యానికి మంచిది కాదని ఇప్పుడు చాలా మంది గోధుమ పిండితోనే ఇంట్లో చిప్స్ తయారు చేస్తున్నారు. అయితే ఇవి మైదా చిప్స్‌లా కరకరలాడవు అనే చిన్న కంప్లైంట్ ఉంటుంది. అలా కాకుండా చిప్స్ బాగా క్రిస్పీగా రావాలంటే.. పిండి కలిపేటప్పుడు అందులో బంగాళాదుంపలను ఉడికించి, బాగా మెదిపి కలపండి. చిప్స్ నెక్స్ట్ లెవెల్ టేస్ట్‌తో క్రిస్పీగా వస్తాయి.

4. బెండకాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే..
ఫ్రిజ్‌లో పెట్టినా కూడా బెండకాయలు ఒక్కోసారి త్వరగా ముదిరిపోతాయి లేదా నల్లగా అయిపోతాయి. బెండకాయలు ఎక్కువ రోజులు జిగురు లేకుండా, తాజాగా ఉండాలంటే.. వాటికి రెండు వైపులా ఉన్న తొడిమెలను కట్ చేసి, ఆ తర్వాత ఒక ఎయిర్ టైట్ ప్లాస్టిక్ కవర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచండి.
5. బంగాళాదుంపలు కుళ్ళిపోకుండా ఉండాలంటే..
బంగాళాదుంపలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటే కుళ్ళిపోవడం లేదా మొలకలు రావడం జరుగుతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే, బంగాళాదుంపలు ఉంచే బుట్టలో కొన్ని వెల్లుల్లి పాయలను కూడా కలిపి ఉంచండి. ఇవి బంగాళాదుంపలను ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉంచుతాయి.
6. దంచిన పసుపు పురుగు పట్టకుండా ఉండాలంటే..
మనం ఇంట్లో దంచిన పసుపును ఎక్కువ రోజులు నిల్వ ఉంచినప్పుడు అందులో చిన్న పురుగులు లేదా బూజు పట్టే అవకాశం ఉంది. పసుపు డబ్బా ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే.. ఆ డబ్బాలో కొద్దిగా ఎండు మిరపకాయలు, రాళ్ల ఉప్పు (కల్లుప్పు) వేసి ఉంచండి. పసుపు అస్సలు పాడవదు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

