Beauty TipsHealthhealth tips in telugu

White Hair To Black Hair: అలోవెరా, ఆమ్లాతో తెల్ల జుట్టుకు చెక్ పెట్టండి! యువత కోసం బెస్ట్ టిప్స్!

Amla white hair to black hair tips in telugu :మనలో చాలా మంది ఏదైనా ఫంక్షన్ లేదా పార్టీలకు వెళ్లేటప్పుడు తెల్ల జుట్టు ఉన్నప్పుడు అప్పటికప్పుడు డై లు ఉపయోగిస్తూ ఉంటారు.

కానీ కొంతమంది కెమికల్స్ తో నిండిన డై ఉపయోగించడం ఇష్టంలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే జుట్టు నల్లగా మారడమే కాకుండా జుట్టుకు పోషణ కూడా అందుతుంది.

ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది యువత తెల్ల జుట్టు (Premature Greying) సమస్యతో బాధపడుతున్నారు. మారిన జీవనశైలి, విపరీతమైన ఒత్తిడి, పోషకాహార లోపం మరియు కెమికల్స్ ఎక్కువగా ఉండే హెయిర్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోంది.

ఈ సమస్యకు ప్రకృతి సిద్ధమైన అద్భుతమైన పరిష్కారం అలోవెరా (Aloe Vera) మరియు ఆమ్లా (Amla – ఉసిరి)! ఈ రెండింటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్-సి జుట్టుకు అవసరమైన మెలనిన్ ఉత్పత్తిని పెంచి, జుట్టును వేర్ల నుండి నల్లగా, బలంగా మార్చడానికి సహాయపడతాయి.

ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లజుట్టును అప్పటికప్పుడు నల్లగా ఉండే లాగా కవర్ చేస్తుంది. దీనికోసం ఒక ఐరన్ పాన్ తీసుకుని దానిలో రెండు స్పూన్ల ఉసిరి పొడి వేసుకోవాలి. ఈ పొడి నల్లగా మారే వరకూ వేగించాలి. నల్లగా మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పొడిని చల్లారనివ్వాలి. చల్లారిన పొడిలో అలోవెరా జెల్ వేసి కలుపుకోవాలి.
kalabanda beauty
ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేయాలి. తర్వాత జుట్టును నీటితో శుభ్రం చేయాల్సిన అవసరం లేదు. తల దువ్వుకుని పార్టీలకు ఫంక్షన్లకు వెళ్ళవచ్చు. తర్వాత రోజు తలస్నానం చేస్తే సరిపోతుంది. ఈ విధంగా చేయడం వలన తెల్ల జుట్టు నల్లగా కాకుండా జుట్టు రాలే సమస్య కూడా తొలగిపోయి జుట్టు ఒత్తుగా ఆరోగ్యంగా పెరుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."