Beauty TipsHealthhealth tips in telugu

బ్యూటీ పార్లర్‌తో పనిలేదు.. సోంపుతో మీ ముఖం నిగనిగలాడేలా చేసుకోండిలా!

Fennel seeds and Honey face glow: బ్యూటీ పార్లర్‌తో పనిలేదు.. సోంపుతో మీ ముఖం నిగనిగలాడేలా చేసుకోండిలా! ముఖం అందంగా తెల్లగా కాంతివంతంగా మెరవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దాని కోసం వేల కొద్ది డబ్భును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృదా చేస్తుంటారు.

సోంపు గింజలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే బ్యూటీ ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. సోంపు చర్మ చాయను మెరుగుపరచటానికి, మొటిమలను తగ్గించటానికి, మచ్చలను తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది. యాంటీ ఏజింగ్ క్రీమ్స్ లో కూడా సోంపును వాడుతున్నారు.

ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి రక్షించడంలో మరియు చర్మ కణాల లైఫ్ ని పెంచటంలో సహాయపడతాయి. సోంపు గింజల్లో రాగి, పొటాషియం, కాల్షియం, జింక్, మాంగనీస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన మొటిమలు, సెల్ డ్యామేజ్, డార్క్ స్పాట్స్ మరియు ముడతలను నివారిస్తాయి.

సోంపును మెత్తని పొడిగా తయారుచేసుకొని పెట్టుకోవాలి. ఒక బౌల్ లో ఒక స్పూన్ సోంపు పొడి,అరస్పూన్ తేనె, అరస్పూన్ పెరుగు వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ని ముఖానికి రాసి ఒక నిమిషం సున్నితంగా మసాజ్ చేసి పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు. అరకప్పు నీటిలో ఒక స్పూన్ సోంపు గింజల పొడి వేసి మరిగించి ఆ నీటిని వడకట్టి చల్లారాక ఒక స్పూన్ నిమ్మరసం కలపాలి. దూది ఉండను ఈ నీటిలో ముంచి ముఖం, మెడ, చేతులు తుడుచుకోవాలి.

ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ నీళ్లు స్వేదరంధ్రాలలోని మలినాలను తొలగించి దురద, దద్దుర్లు లాంటివాటినీ, ట్యాన్ వంటి సమస్యలను తగ్గించి చర్మంను కాంతివంతంగా మారుస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."