Beauty TipsHealthhealth tips in telugu

కేవలం 5 నిమిషాల్లో తెల్ల జుట్టు నల్లగా.. రాలడం తగ్గి ఒత్తుగా పెరగాలంటే ఇలా చేయండి!

White Hair Home Remedies In Telugu :కేవలం 5 నిమిషాల్లో తెల్ల జుట్టు నల్లగా.. రాలడం తగ్గి ఒత్తుగా పెరగాలంటే ఇలా చేయండి.. మారిన పరిస్థితి కారణంగా జుట్టుకి సంబంధించి ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి.

అలాగే మన జీవితాల్లో ఎన్నో రకాల మార్పులు వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా చాలా చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య వచ్చేస్తుంది. ఇలా తెల్ల జుట్టు సమస్య రాగానే చాలా కంగారు పడిపోయి తెల్ల జుట్టును కవర్ చేయడానికి మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు.
Green Tea Brain Health Benefits
ఇలా వాడటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. మన ఇంటిలో సహజసిద్ధంగా తయారు చేసుకునే ఇంటి చిట్కాల ద్వారా జుట్టును నల్లగా మార్చుకోవచ్చు

దీని కోసం మనం నీటిని తయారుచేసుకుని పదిహేను రోజుల పాటు ఫ్రిజ్లో నిల్వ చేసుకొని వాడితే మంచి ఫలితం కనబడుతుంది.తెల్ల జుట్టు సమస్య తగ్గడమే కాకుండా జుట్టు రాలే సమస్య,చుండ్రు సమస్య కూడా తొలగిపోతుంది.

పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి స్పూన్ టీ పొడి, రెండు బిర్యానీ ఆకులు, ఒక వెల్లుల్లిపాయ వేసి బాగా మరిగించాలి. ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగుస్తే మనం తీసుకున్న ఇంగ్రిడియంట్స్ లోని పోషకాలు అన్ని నీటిలోకి చేరతాయి. ఈ నీటిని వడగట్టి దీనిలో కొంచెం కొబ్బరి నూనె కలపాలి. ఈ నీటిని జుట్టుకు బాగా పట్టించాలి.

తలస్నానం చేసి అరిన జుట్టుకు ఈ నీటిని పట్టించాలి. అరగంటయ్యాక సాధారణమైన నీటితో తల స్నానం చేయాలి. ఆ రోజు తలకు షాంపూ పెట్టకూడదు. మరుసటి రోజు తలకు షాంపూ పెట్టొచ్చు.

ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. అలాగే జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య వంటి జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి.

ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితం కనబడుతుంది. ఇంటి చిట్కాలను పాటిస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా సులభంగా జుట్టుకి సంబందించిన అన్ని రకాల సమస్యల నుండి బయట పడవచ్చు. ఈ చిట్కాలో ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియన్స్ మనకు సులభంగా అందుబాటులో ఉండేవే.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."