Kitchenvantalu

వంటగదిలో మీ పనిని సులువు చేసే బెస్ట్ కిచెన్ టిప్స్!

Smart Kitchen Tips In telugu :వంట చేయడం అంటే గంటల తరబడి కిచెన్‌లో కష్టపడటం అని చాలామంది అనుకుంటారు. కానీ కొన్ని చిన్న చిన్న స్మార్ట్ హ్యాక్స్ తెలిస్తే వంటగదిలో మీ పని చాలా సులువవుతుంది.

కూరగాయలు త్వరగా కట్ చేసుకోవడం దగ్గరి నుంచి, వంటకాలను తాజాగా నిల్వ చేసుకోవడం వరకు మీ సమయాన్ని, శ్రమను ఆదా చేసే బెస్ట్ కిచెన్ టిప్స్ మీకోసం ఇక్కడ అందిస్తున్నాం. ప్రతిరోజూ మీకు పర్ఫెక్ట్‌గా ఉపయోగపడే ఆ అద్భుతమైన వంటింటి చిట్కాలు ఏంటో ఈ ఆర్టికల్‌లో చూద్దాం.

వంటగదిలో మీ పనిని సులువు చేసే బెస్ట్ కిచెన్ Tips.. ప్రతి రోజు మనం చేసే పనిలో కొన్ని చిట్కాలను పాటిస్తే పని సులభం అవటమే కాకుండా శుభ్రం కూడా అవుతుంది. మనం ఎన్ని చిట్కాలను తెలుసుకున్నా సరే ఇంకా కొత్త కొత్త చిట్కాలను తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. అందువల్ల ఇప్పుడు అటువంటి స్మార్ట్ చిట్కాలను తెలుసుకుందాం.
smart kitchen tips
గ్యాస్ స్టవ్ బర్నర్స్ శుభ్రం చేయటానికి సిరంజి నీడిల్స్ ఉపయోగిస్తే….బర్నర్స్ ని సులువుగా శుభ్రం చేయవచ్చు.

గాజు గ్లాసులను శుభ్రం చేసే నీటిలో కొంచెం బట్టలకు ఉపయోగించే బ్యూ కలిపితే గ్లాసులు తళతళ మెరుస్తాయి.

కరివేపాకును నూనెలో వేగించి చల్లారాక సీసాలో నిల్వ ఉంచుకుంటే….ఏదైనా కూర చేసుకున్నప్పుడు వేగించిన కరివేపాకు కలిపితే మంచి రుచి వస్తుంది.

పాత్రలపై ఉన్న స్టిక్కర్స్ సులభంగా ఊడాలంటే, ఆ స్టిక్కర్ కి కొవ్వొత్తి వేడి చూపితే సరిపోతుంది.

ఆకుకూరలు తాజాగా ఉండాలంటే తడిబట్టలో చుట్టి ఫ్రిడ్జ్ లో పెట్టాలి.

కాకరకాయ చేదు పోవాలంటే కాకరకాయ వండే సమయంలో పచ్చి మామిడి కాయ ముక్కలు వేస్తే కాకరకాయ చేదు పోవటమే కాక కూర మంచి రుచి వస్తుంది.

కంప్యూటర్ కీ బోర్డ్, మౌస్ వంటి వాటిపై పడిన మరకలను నెయిల్ ఫాలిష్ రిమూవర్ తో సులభంగా తొలగించవచ్చు.

సమోసాలు కరకరలాడాలంటే….పిండి కలిపే సమయంలో కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."