Healthhealth tips in telugu

15 రోజులు ఇలా చేస్తే చాలు.. నడుము నొప్పి, కీళ్ల నొప్పులు మాయం.. ఎముకలు ఇనుములా మారతాయి!

calcium rich foods : ఆధునిక జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం మరియు సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల వయసుతో సంబంధం లేకుండా చాలామందిని కీళ్ల నొప్పులు (Joint Pains), నడుము నొప్పి (Back Pain) మరియు తీవ్రమైన నిస్సత్తువ వేధిస్తున్నాయి.

శరీరంలో క్యాల్షియం, విటమిన్ డి లోపం వల్ల ఎముకలు గుల్లబారిపోయి చిన్న పనులకే అలసిపోవడం, కూర్చుని లేవడానికి కూడా ఇబ్బంది పడటం జరుగుతుంటుంది. పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల తాత్కాలిక ఉపశమనం లభించినా, కాలేయం, కిడ్నీలపై చెడు ప్రభావం పడే అవకాశం ఉంది.

ప్రకృతి సిద్ధంగా లభించే క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్ అధికంగా ఉండే కొన్ని సహజ పదార్థాలను సరైన మోతాదులో తీసుకుంటే 15 రోజుల్లోనే ఎముకలు ఇనుములా బలంగా తయారవుతాయి.

ఎముకల మధ్య ఉండే గుజ్జు (cartilage) మెరుగుపడి నొప్పులు క్రమంగా తగ్గుతాయి. ఈ పోస్ట్‌లో శరీరానికి బలాన్నిచ్చే ఆ అద్భుతమైన ఆహార పదార్థాలు, వాటిని తయారుచేసుకునే విధానం మరియు రోజువారీ వాడే పద్ధతిని వివరంగా తెలుసుకుందాం.

కాల్షియం లోపం కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. వాటిని ఎలా పరిష్కారం చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం. కాల్షియం లోపం ఉంటే కాళ్ళ నొప్పులు,శరీరంలో బలహీనత,అలసటగా ఉండటం వంటివి ఉంటాయి. ఈ సమస్యలు కనపడగానే సాధారణంగా ప్రతి ఒక్కరు టాబ్లెట్స్ వేసుకుంటారు.
Jaggery Health Benefits in Telugu
ఆలా టాబ్లెట్స్ వేసుకోకుండా ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కా పాటిస్తే మంచి ఫలితం కనపడుతుంది. నాలుగు బాదం పప్పులను రాత్రి సమయంలో నానబెట్టాలి. మరుసటి రోజు తొక్క తీసి తురమాలి. పొయ్యి మీద గిన్నెలో ఒక గ్లాస్ పాలను పోసి కాస్త వేడి అయ్యాక తురిమిన బాదం వేసి ఒక నిమిషం మరిగించాలి.

ఆ తర్వాత చిన్న బెల్లం ముక్క వేసి రెండు నిమిషాలు మరిగాక గ్లాస్ లో పోసి పావు స్పూన్ పసుపు వేసి బాగా కలిపి కాస్త వేడిగా ఉన్నప్పుడే తాగాలి. ఈ పాలను 15 రోజుల పాటు తాగితే అన్నీ రకాల నొప్పులు తగ్గటమే కాకుండా కాల్షియం లోపం కూడా ఉండదు. కాస్త ఓపికగా ఈ పాలను తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది.

కాల్షియం లోపం తక్కువగా ఉన్నప్పుడు ఈ పాలను తాగితే సరిపోతుంది. అదే ఎక్కువగా ఉంటే మాత్రం డాక్టర్ చెప్పిన విధంగా సూచనలను పాటిస్తూ ఈ పాలను తాగితే చాలా తొందరగా ఆ లోపం నుండి బయట పడవచ్చు. ఈ పాలను తాగటం వలన శరీరంలో నొప్పి, కీళ్ల నొప్పులు, ఎముకలు బలహీనత, ఎముకల నుండి టక్ టక్ అని శబ్ధం అన్నీ తగ్గిపోతాయి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."