Beauty TipsHealthhealth tips in telugu

ఎలాంటి ఖర్చు లేకుండా ముఖంపై ముడతలు, మచ్చలు మాయమై మెరిసిపోవాలంటే ఇలా చేయండి!

Rice and almond oil Face Glow Tips in telugu : వయసు పెరిగే కొద్దీ లేదా కాలుష్యం మరియు సరైన కేర్ లేకపోవడం వల్ల ముఖంపై ముడతలు (Wrinkles), నల్లని మచ్చలు (Dark Spots) ఏర్పడి ముఖం కళావిహీనంగా మారుతుంది. దీనికోసం ఖరీదైన క్రీమ్స్ వాడాల్సిన పనిలేదు.

పైసా ఖర్చు లేకుండా, ఇంట్లోనే దొరికే సహజమైన పదార్ధాలతో మీ చర్మాన్ని ఎలా యవ్వనంగా, కాంతివంతంగా మార్చుకోవచ్చో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖం మెరిసిపోవడానికి ఈ చిన్న చిట్కాను ఇప్పుడే ట్రై చేయండి!

ముఖం అందంగా కాంతివంతంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. దాని కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఆలా కాకుండా ఇంటి చిట్కాలతో చాలా సమర్ధవంతంగా ముఖం మీద ముడతలు, నల్లని మచ్చలు లేకుండా చేసుకోవచ్చు. కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.

ఈ రెమిడీ కోసం ఉడికించిన్న అన్నం, బాదం నూనె తీసుకుంటున్నాము. అన్నంలో ఉన్న పోషకాలు ముఖం మీద ఉండే ఫిగ్మెంటేషన్ తొలగించి చర్మం యవన్నంగా ఉండేలా చేస్తుంది. చర్మ సంరక్షణలో బియ్యం, అన్నం, బియ్యంపిండి ఈ మూడు చాలా బాగా సహాయపడతాయి.

ఒక కప్పు అన్నం తీసుకొని మిక్సీ జార్ లో వేసి కొంచెం నీటిని పోసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఈ పేస్ట్ ని ఒక బౌల్ లోకి తీసుకొని దానిలో ఒక స్పూన్ బాదం నూనె వేసి బాగా కలపాలి. బాదం నూనెలో ఉన్న పోషకాలు ముఖం మీద మచ్చలు లేకుండా కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.

ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి అరగంట అయ్యాక చల్లని నీటిఓ శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి 2 సార్లు చేస్తూ ఉంటే క్రమంగా ముఖం మీద ముడతలు, మచ్చలు అన్నీ తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

#FaceGlowTips #AntiAging #NaturalSkincare #DarkSpotsRemoval #TeluguBeautyTips #GlowingSkin

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."