Beauty TipsHealthhealth tips in telugu

జుట్టు రాలడం ఆగి, ఒత్తుగా పెరగాలా? ఈ గింజలతో చేసిన నూనె వాడి చూడండి!

Hair Fall and growth Tips In Telugu : ఈ రోజుల్లో కాలుష్యం, ఒత్తిడి, పోషకాహార లోపం వల్ల జుట్టు రాలడం అనేది చాలా సాధారణ సమస్యగా మారిపోయింది. రాలిపోయిన జుట్టు మళ్లీ మొలవాలన్నా, ఉన్న జుట్టు ఒత్తుగా పెరగాలన్నా మార్కెట్లో దొరికే రసాయనాలతో కూడిన నూనెలు వాడాల్సిన అవసరం లేదు.

మన వంటింట్లో దొరికే కొన్ని అద్భుతమైన గింజలతో స్వచ్ఛమైన నూనెను ఎలా తయారు చేయాలో, దాని వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలు ఏమిటో ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకుందాం.

ఈ మధ్య కాలంలో జుట్టు రాలే సమస్య ఎక్కువ అయింది. జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే చాలా మంది మార్కెట్ లో దొరికే రకరకాల పొడక్ట్స్ వాడుతూ ఉంటారు. వాటి వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఇంటి చిట్కాలు ఫాలో అయితే మంచి ఫలితం కనపడుతుంది. కాస్త ఓపికగా చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది.

జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవటానికి గురివింద గింజలు ఉపయోగించి నూనె తయారు తయారుచేసుకోవాలి. ఈ గింజలు మనలో చాలా మందికి తెలుసు. ఈ గురివింద గింజలు ఆయుర్వేదం షాప్ లో అందుబాటులో ఉంటాయి. పల్లెటూర్లో అయితే పొలాల్లో దొరుకుతాయి.

ఈ గింజలను 20 నుంచి 30 వరకు తీసుకొని మిక్సీలో వేసి పప్పులా చేసుకోవాలి. ఈ పప్పును ఒక మందపాటి గుడ్డలో వేసి మూట కట్టి స్టౌ పై అర గ్లాసు పాలను పెట్టి ఈ మూటను దానిలో వేసి పాలు దగ్గరయ్యే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చెయ్యాలి.

ఈవిధంగా పాలల్లో ఉడికించడం వలన గురివింద గింజలలో ఉన్న ఔషధ గుణాలు బయటకు వస్తాయి. 100 గ్రాములు కొబ్బరి నూనెలో ఒక స్పూన్ బృంగరాజ్ పౌడర్ వేసి ఒక నిమిషం వేగించాలి. ఆ తర్వాత ఉడికించుకున్న గురువింద గింజ పప్పు కూడా వేయాలి.పొయ్యి మీద నూనె మరిగే వరకు ఉంచాలి.

ఈ నూనె చల్లారాక వడకట్టి నిలువ చేసుకోవాలి. ఈ నూనెను తలకు రాసి అలా ఉంచుకోవచ్చు లేదా మరుసటి రోజు ఉదయం తల స్నానం చేయవచ్చు ఇలా వారానికి రెండుసార్లు చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గడమే కాకుండా తెల్లజుట్టు సమస్య కూడా తొలగిపోయింది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."