Beauty TipsHealthhealth tips in telugu

ముఖంపై ముడతలు, మచ్చలు మాయం.. యవ్వనమైన చర్మం కోసం అద్భుతమైన రెమెడీ!

Home remedies for wrinkles In Telugu : వయసు పెరుగుతున్న కొద్దీ ముఖంపై ముడతలు రావడం సహజం. అయితే కాలుష్యం, ఒత్తిడి వల్ల ఈ రోజుల్లో చిన్న వయసులోనే చర్మంపై మచ్చలు, గీతలు కనిపిస్తున్నాయి. దీనికోసం బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. మన ఇంట్లో ఉండే సహజసిద్ధమైన వస్తువులతోనే చర్మాన్ని మళ్లీ బిగుతుగా, మచ్చల్లేకుండా యవ్వనంగా ఎలా మార్చుకోవాలో ఈ పోస్ట్‌లో వివరంగా తెలుసుకుందాం.

ముఖం మీద మొటిమలు,నల్లని మచ్చలు అధికంగా ఉన్నప్పుడు వాటిని తగ్గించుకోవటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మార్కెట్లో దొరికే రకరకాల పొడక్ట్స్ వాడుతూ ఉంటారు. అలాగే వేలకొద్ది డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇంటి చిట్కాల ద్వారా చాలా తక్కువ ఖర్చుతో ముడతలను తగ్గించుకోవచ్చు.

ఈ రెమిడీ కోసం జీలకర్రని ఉపయోగిస్తున్నాం.జీలకర్రను మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి.జీలకర్రలో పొటాషియం,సెలీనియం,యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వల్ల మొటిమలు ముడతలు లేకుండా ముఖం యవ్వనంగా ఉండేలా చేస్తుంది.

ఒక బౌల్ లో ఒక స్పూన్ జీలకర్ర పొడి, అరస్పూన్ అలోవెరా జెల్, అర చెక్క నిమ్మరసం వేసి బాగా కలిపి ముఖానికి పట్టించాలి. పావుగంటయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తుంటే ముడతలు, నల్లని మచ్చలు అన్ని తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.

కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. ముఖ చర్మానికి సంబందించిన అన్ని రకాల సమస్యలను తగ్గించటానికి ఈ చిట్కా చాలా బాగా సహాయపడుతుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."