Healthhealth tips in telugu

పప్పులు తింటే గ్యాస్, కడుపుమంట వస్తున్నాయా? ఇలా తింటే ఆ సమస్యే ఉండదు!

Pulses In summer : ప్రతిరోజూ మన ఆహారంలో పప్పులు లేనిదే ముద్ద దిగదు. పోషకాల పరంగా పప్పు దినుసులు ఎంతో మేలు చేసినప్పటికీ, కొంతమందికి మాత్రం ఇవి తిన్న తర్వాత కడుపులో మంట, విపరీతమైన గ్యాస్, అసిడిటీ మరియు శరీరంలో వేడి చేయడం వంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి.

అందువల్లే చాలా మంది ఆరోగ్యకరమైన పప్పులను తినడానికే భయపడుతుంటారు. అయితే, పప్పులను వండే విధానంలో లేదా తీసుకునే పద్ధతిలో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా ఈ సమస్యలన్నింటికీ సులభంగా చెక్ పెట్టవచ్చు.
moong dal
పెసరపప్పు శరీరంలో వేడిని తగ్గించటానికి సహాయపడుతుంది. మన ఆముమ్మల కాలం నుండి పెసరపప్పును వేసవికాలంలో వాడుతున్నారు. ఈ పప్పులో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి జీర్ణ సంబంద సమస్యలు లేకుండా చేస్తుంది. వీటిలో ఉన్న పోషకాలు శరీరాన్ని పటిష్టంగా ఉంచుతాయి.

మినపప్పును పొట్టు ఉన్న పప్పును వాడాలి. శరీరంలో మంటను తగ్గించటమే కాకుండా శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన జీర్ణ సంబంద సమస్యలు కూడా ఉండవు. ముఖ్యంగా ఆర్థరైటిస్ లేదా ఆస్తమా రోగులు మినప పప్పు తీసుకోవడం చాలా మంచిది.

శనగలలో మాంసకృత్తులు సమృద్దిగా ఉండుట శరీరానికి అవసరమైన శక్తి లభించి వేసవిలో ఉండే అలసట,నీరసం వంటివి ఏమి లేకుండా చేస్తుంది. వేసవిలో శరీరంలో వేడిని తగ్గిస్తుంది, శనగలతో కూర చేసుకోవచ్చు. లేదా ఉడికించుకొని తినవచ్చు. ప్రతి రోజు ఒక స్పూన్ శనగలను రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన శనగలను తింటూ ఆ నీటిని తాగాలి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."