గార పట్టిన పసుపు పళ్లు ముత్యాల్లా మెరవాలంటే ఈ అద్భుతమైన చిట్కాలు మీకోసమే!
White Teeth Home remedies In telugu : నవ్వు ముఖానికి అందాన్నిస్తుంది. కానీ, పళ్లు పసుపు రంగులో లేదా గార పట్టి ఉంటే నలుగురిలో మనస్ఫూర్తిగా నవ్వాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. టీ, కాఫీలు ఎక్కువగా తాగడం, సరైన డెంటల్ కేర్ పాటించకపోవడం వల్ల పళ్లు తమ సహజమైన తెలుపు రంగును కోల్పోతాయి.
దీనికోసం ఖరీదైన ట్రీట్‌మెంట్స్ అవసరం లేకుండా, కేవలం మన వంటగదిలో దొరికే కొన్ని వస్తువులతోనే పళ్లను తిరిగి తెల్లగా, ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. ఆ సింపుల్ హోమ్ రెమెడీస్ ఏంటో ఈ పోస్ట్ లో వివరంగా చూద్దాం.
మనం ఎంత శుభ్రత పాటించినా దంతాలు రంగు మారడం సహజం. ఆహారపు అలవాట్ల వల్ల దంతాలు పసుపుపచ్చగా మారతాయి. ఈ పసుపు పొరను తొలగించి, తిరిగి దంతాలను ముత్యాల్లా మెరిసిపోవాలంటే ఇంటి చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. చాలా మంది పళ్ళు పసుపుగా మారగానే డాక్టర్ దగ్గరకు పరిగెట్టి ఖరీదైన ట్రీట్ మెంట్స్ తీసుకుంటూ ఉంటారు.

అవి తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తాయి. మన ఇంటిలో సులువుగా దొరికే సహజసిద్ధమైన పదార్ధాలతో పళ్ళ మీద పసుపు గారను పోగొట్టు కోవచ్చు. అలాగే కావిటీస్,గార,పంటి నొప్పి,చిగుళ్ల నొప్పిని తగ్గించుకోవచ్చు. ఈ చిట్కా కోసం ఉపయోగించే అన్నీ ఇంగ్రిడియన్స్ ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేవే.
ఒక బౌల్ లో అరస్పూన్ కొబ్బరి నూనె, అరస్పూన్ పసుపు, రెండు చుక్కల లవంగాల నూనె, చిటికెడు ఉప్పు వేసి అన్నీ ఇంగ్రిడియన్స్ బాగా కలిసేలా కలపాలి. ఈ మిశ్రమాన్ని బ్రష్ సహాయంతో దంతాలకు అప్లై చేసి సున్నితంగా రెండు నుంచి మూడు నిమిషాల పాటు తోముకోవాలి. ఆ తర్వాత దంతాలను మరియు నోటిని శుభ్రంగా వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.
మనం కాస్త శ్రద్ద,సమయాన్ని కేటాయిస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పసుపు రంగు,గార పట్టిన పళ్లను తెల్లగా మార్చుకోవచ్చు. చాలా తక్కువ ఖర్చులో చాలా సులభంగా తెల్లని పళ్లను సొంతం చేసుకోవచ్చు. ఈ రెమిడిని ఫాలో అయితే పంటి నొప్పి, సమస్యలు,చిగుళ్ళ సమస్యలు కూడా తగ్గుతాయి.కాబట్టి ఈ చిట్కాను ట్రై చేయండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

