నల్లటి పెదాలను లేత గులాబీ రంగులోకి మార్చే అద్భుతమైన చిట్కాలు!
pink lips Home remedies :అందమైన, గులాబీ రంగు పెదవులు ముఖ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తాయి. కానీ వాతావరణ మార్పులు, డీహైడ్రేషన్, సరైన లిప్ కేర్ లేకపోవడం, లేదా కెమికల్స్ ఉన్న లిప్‌స్టిక్స్ వాడటం వల్ల చాలా మంది పెదవులు నల్లగా, నిర్జీవంగా మారుతుంటాయి.
వీటిని కవర్ చేయడానికి మళ్లీ లిప్‌స్టిక్స్ వాడితే సమస్య మరింత పెరుగుతుంది. ఈ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టి, మీ పెదాలను సహజంగానే లేత గులాబీ రంగులోకి మార్చే అద్భుతమైన హోమ్ రెమెడీస్ మరియు లిప్ కేర్ టిప్స్ ఏమిటో ఈ పోస్ట్‌లో వివరంగా చూద్దాం
ఈ సీజన్ లో చాలా మందికి పెదాలు నల్లగా మారి పొట్టు రాలుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ సీజన్ లో జీవం కోల్పోయి పెదాలు పగిలి నల్లగా మారి ఒక్కోసారి పెదాల నుండి నొప్పి, రక్తం కూడా వస్తూ ఉంటాయి. ఈ సమస్య నుంచి బయటపడటానికి ఎక్కువగా నీటిని తాగాలి. అలాగే ఇప్పుడు చెప్పే చిట్కా పాటిస్తే కావలసిన తేమ అంది పెదాలు గులాబీ రంగులోకి మారతాయి.

ఫిగ్మెంటేషన్ తొలగిపోయి గులాబీ రంగులోకి మారతాయి. దీని కోసం ఒక్క బౌల్ లో ఒక స్పూన్ వాసెలిన్, ఒక స్పూన్ తేనె వేసి బాగా కలిసేలా కలపాలి. ఈ మిశ్రమాన్ని గాలి చొరబడని సీసాలో నిల్వ చేస్తే దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ప్రతి రోజు పెదాలకు రాసి 5 నిమిషాలు అయ్యాక శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.
ఈ విధంగా చేయటం వలన పెదాలు పొడిగా లేకుండా తేమగా ఉంటాయి. ఎప్పుడు పెదాలు తేమగా ఉండేలా చూసుకోవాలి. పెదాలు పొడిగా మారితేనే సమస్యలు వస్తాయి. అలాగే రోజులో సరిపడా నీటిని తాగుతూ ఉండాలి. ఇక తేనె విషయానికి వస్తే నేచురల్ మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది.
నల్లని పెదాలు గులాబీ రంగులోకి మారటానికి ఎటువంటి క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు. చాలా తక్కువ ఖర్చుతో చాలా సులభంగా ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు. కాకపోతే కాస్త ఓపిక,సమయం ఉండాలి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నల్లని పెదాలను గులాబీ రంగులోకి మార్చుకోవచ్చు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

