ధాబా స్టైల్ ఆలు పాలక్.. ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది!
Dhaba Style Aloo Palak Recipe: పాలకూర ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ పిల్లలు, ఒక్కోసారి పెద్దలు కూడా దీన్ని తినడానికి పెద్దగా ఆసక్తి చూపించరు. అలాంటి వారి కోసం కాస్త వెరైటీగా, నోరూరించేలా పక్కా ‘ధాబా స్టైల్ ఆలు పాలక్’ చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు!
రెస్టారెంట్లు, హైవే ధాబాల్లో దొరికే అదే అద్భుతమైన రుచితో, చిక్కటి గ్రేవీతో ఇంట్లోనే ఈ ఆలు పాలక్ కర్రీని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. చపాతీ, నాన్, బటర్ రోటీ లేదా వేడి వేడి అన్నంలోకి ఈ కర్రీ సూపర్ కాంబినేషన్. మరి ఆ స్పెషల్ దాబా రుచి రావాలంటే ఏయే మసాలాలు వాడాలి? పర్ఫెక్ట్ తయారీ విధానం ఏంటి? అనేది ఈ పోస్ట్‌లో వివరంగా చూద్దాం.

నార్త్ ఇండియెన్స్ ఎంతో ఇష్టపడే, ఆలు పాలక్, దాబా స్టైల్లో, ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఘుమఘుమలాడే మసాలాలతో, టేస్టీ టేస్టీ ఆలు పాలక్ తయారు చేద్దాం.
కావాల్సిన పదార్ధాలు
పాలకూర ఆకులు – 200 గ్రాములు
ఉడికించిన ఆలు – 200 గ్రాములు
నూనె – 3 టేబుల్ స్పూన్స్
జీలకర్ర – ½ టీస్పూన్
ఎండుమిర్చి – 1
వెల్లుల్లి – 1 టీ స్పూన్
ఉల్లి పాయ – 1 కప్పు
పచ్చిమిర్చి తరుగు – 1 టేబుల్ స్పూన్
ఉప్పు – తగినంత
జీలకర్రపొడి – 1/2టీస్పూన్
ధనియాల పొడి – 1 టీ స్పూన్
కారం – 1 టీస్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్
నెయ్యి – 2 టీ స్పూన్స్
తయారీ విధానం
1.మరిగే నీళ్లలో పాలకూర ఆకు వేసి, మూడు నిముషాలు ఉడికించి, వెంటనే చల్లని నీళ్లలో వేయాలి.
2. చల్లారిన ఆకులను వడకట్టి, మిక్సీ జార్ లో మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి.
3. ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకుని, నూనె వేడి చేసి అందులోకి జీలకర్ర, ఎండుమిర్చి వెల్లుల్లి వేసి, వేగాక, ఉల్లిపాయలు కూడా వేస వేపుకోవాలి.
4.ఉల్లిపాయ మెత్తపడ్డాక, పచ్చిమిర్చి వేసి, వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు వేసి మాడిపోకుండా, వేపుకోవాలి.
5. వేగిన మసాలాల్లో గ్రైండ్ చేసిన పాలక్ పేస్ట్, కాసిన్ని నీళ్లు పోసి, పల్చగా చేసి , మీడియం ఫ్లేమ్ పై, మూత పెట్టుకుని, నూనె తేలేవరకు ఉడికించాలి.
6. 10 నిముషాలు పాలకూర ఉడికాక, ఉడికించుకున్న ఆలు ముక్కలు వేసి, మరో 5 నిముషాలు 5 ఉడికించుకోవాలి.
7. చివరగా స్టవ్ ఆఫ్ చేసే ముందు నెయ్యి వేసుకుని, బాగా కలిపి, సెర్వ్ చేసుకోవాలి.

