Kitchenvantalu

పిల్లల లంచ్ బాక్స్‌లోకి 5 నిమిషాల్లో అయిపోయే టేస్టీ క్యారెట్ రైస్!

Carrot Rice |లంచ్ బాక్స్ లోకి 5నిమిషాల్లో టేస్టీగా రెడీ..కావలసిన పదార్ధాలు,తయారి విధానం తెలుసుకుందాం. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి మహిళలకు హడావిడి మొదలవుతుంది. ఈ బిజీలో పిల్లలకు, ఆఫీస్‌కు వెళ్లేవారికి లంచ్ బాక్స్‌లో ఏం కట్టాలి అనేది ప్రతి రోజూ ఎదురయ్యే పెద్ద సమస్య. కూరలు వండే సమయం లేనప్పుడు కేవలం 5 నిమిషాల్లో అద్భుతమైన రుచితో ‘క్యారెట్ రైస్’ తయారు చేయవచ్చు.

క్యారెట్ కంటి ఆరోగ్యానికి, రక్త వృద్ధికి ఎంతో మంచిది, కానీ పిల్లలు దీన్ని తినడానికి మారం చేస్తుంటారు. ఇలా కమ్మగా రైస్ చేసి పెడితే లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసి వస్తారు. సమయం ఆదా అవ్వడంతో పాటు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ ఇన్స్టంట్ క్యారెట్ రైస్ తయారీ విధానం ఏంటో ఈ పోస్ట్‌లో చూద్దాం
Carrot
కావలసిన పదార్దాలు
వండిన అన్నం – 2 కప్పులు
తురిమిన క్యారట్ – 1 కప్పు
ఉల్లిపాయ -1
పచ్చిమిరపకాయలు -2
యాలకులు – 2
లవంగాలు – 4
దాల్చిన చెక్క – 1″ ముక్క
షాజీర – 1/2 స్పూన్
అల్లం, వెల్లుల్లి పేస్ట్ -1/2 స్పూన్
కరివేపాకు -1 రెమ్మ
కొ్త్తిమిర – 2 రెమ్మలు
ఉప్పు – తగినంత
నూనె – 1 స్పూన్

తయారి విధానం
అన్నం మెత్తగా కాకుండా పొడి పొడిగా ఉండేలా వండాలి. బాణలిలో నూనె పోసి వేడెక్కాక సన్నగా కోసుకున్న ఉల్లిపాయలు, నిలువుగా చీల్చిన పచ్చిమిరపకాయలు , కరివేపాకు వేసి కొంచెం సేపు వేగించాలి.

ఆ తర్వాత లవంగాలు,యాలకులు, దాల్చిన చెక్క, షాజీర ,అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూడు నిమిషాలు వేగించాలి. తురిమిన క్యారట్ వేసి తడి పోయేంతవరకు వేగించాలి. పొడి పొడిగా ఉన్న అన్నంను ఇందులో కలపాలి. సరిపడ ఉప్పు, సన్నగా కోసిన కొత్తిమిర వేసి బాగా కలిపి కొంచెం సేపు వేగించి దింపాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."