కొబ్బరి నూనెతో ఇలా చేస్తే కాలి పగుళ్లు మాయం అవ్వడం ఖాయం!
cracked heels Home Remedies in winter : పాదాల అందాన్ని దెబ్బతీయడమే కాకుండా, నడుస్తున్నప్పుడు తీవ్రమైన నొప్పిని కలిగించే సమస్య కాలి పగుళ్లు. వాతావరణ మార్పులు, దుమ్ము, ధూళి, మరియు పాదాలకు సరైన తేమ లేకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంటుంది. వీటిని తగ్గించుకోవడానికి మార్కెట్లో దొరికే రకరకాల క్రీమ్స్ వాడినా ఫలితం తాత్కాలికంగానే ఉంటుంది.
కానీ, మన ఇంట్లో రోజూ వాడే కొబ్బరి నూనెతో ఈ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు. కొబ్బరి నూనె పాదాలకు లోతైన తేమను అందించి, మృతకణాలను తొలగించి పగుళ్లను మాయం చేస్తుంది. ఇంతకీ మృదువైన పాదాల కోసం కొబ్బరి నూనెను సరైన పద్ధతిలో ఎలా వాడాలో ఈ పోస్ట్‌లో వివరంగా చూద్దాం
చలికాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పాదాల పగుళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. పాదాల పగుళ్ళు ప్రారంభంలో అంటే చాలా తక్కువగా ఉన్నప్పుడు ఇంటి చిట్కాలను ప్రయత్నిస్తే మంచి ఫలితం కనబడుతుంది.

మనలో చాలామంది పాదాల పగుళ్లు కనబడగానే Ointment కోసం చూస్తారు. అలాంటి వారు ఈ చిట్కాలను పాటిస్తే Ointment జోలికి వెళ్లకుండా ఉంటారు.రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెతో పాదాలకు మసాజ్ చేయాలి.
మసాజ్ చేయడానికి ముందు పాదాలను మురికి వదిలే వరకు బాగా శుభ్రంగా కడిగి తుడిచి ఆ తర్వాత నూనె రాసి మసాజ్ చేసి సాక్స్ వేసుకోవాలి. మరుసటి రోజు ఉదయం పాదాలను శుభ్రంగా కడగాలి. ఈ విధంగా కొన్ని రోజులపాటు చేస్తే మృదువైన పాదాలు మీ సొంతం అవుతాయి
కొబ్బరి నూనె పొడి చర్మానికి తేమను అందిస్తుంది. పగిలిన మడమలకు కొబ్బరినూనె చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కొబ్బరి నూనెలో విటమిన్ E, ప్రోటీన్ సమృద్దిగా ఉండుట వలన దెబ్బతిన్న చర్మ కణాలను రిపేర్ చేయడంలో సహాయపడతాయి.
అంతేకాకుండా యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండుట వలన ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది. అలాగే కొబ్బరి నూనెలో లారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కూడా దెబ్బతిన్న చర్మ కణాలను రిపేర్ చేయటమే కాకుండా కొత్త కణాల ఏర్పాటుకు సహాయపడుతుంది.
కొబ్బరి నూనెతో మసాజ్ చేస్తే సర్క్యులేషన్ బాగా జరిగి పాదాలు తేమని కోల్పోకుండా ఉంటాయి. పాదాల పగుళ్లు వచ్చినప్పుడు ఖరీదైన Ointments వాడవలసిన అవసరం లేదు. ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

