మీ శ్రమను సగానికి తగ్గించే అద్భుతమైన వంటింటి చిట్కాలు!
Telugu Useful Kitchen Tips:మహిళలు రోజులో ఎక్కువ సమయం గడిపేది వంటగదిలోనే. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు వంటగదిలో ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. కొన్నిసార్లు చిన్న పనులకే ఎక్కువ సమయం వృథా అవుతుంది, మరికొన్నిసార్లు వంట చేసేటప్పుడు కూర మాడిపోవడమో, ఉప్పు ఎక్కువవ్వడమో జరుగుతుంటుంది.
ఇలాంటప్పుడు కొన్ని స్మార్ట్ కిచెన్ టిప్స్ (Kitchen Tips) తెలిస్తే, మన పని ఎంతో సులభం అవుతుంది. వంటను మరింత రుచిగా చేయడమే కాదు, గ్యాస్, సమయం, మరియు డబ్బును ఆదా చేసే ఎన్నో అద్భుతమైన, ఇప్పటివరకు ఎవరూ చెప్పని సీక్రెట్ కిచెన్ హ్యాక్స్ గురించి ఈ పోస్ట్‌లో వివరంగా తెలుసుకుందాం.

ఈ మధ్య కాలంలో జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినటం వలన కడుపు నొప్పి తరచుగా వస్తూ ఉంటుంది. అలా కడుపు నొప్పిగా ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పే చిట్కా చాలా బాగా సహాయపడుతుంది. జీలకర్ర, పంచదార కలిపి నమిలితే కడు పునొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
గ్లాసు నీళ్ళలో పావు టీ స్పూన్ ఏలకుల పొడి కలుపుకుని తాగితే యూరినరీ ఇన్ ఫెక్షన్ బాధ నుంచి బయట పడవచ్చు.
అల్లం ముక్కని ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఇందులో చిటికెడు జీలకర్ర పొడి, పంచదార కలిపి తింటే దగ్గు తగ్గుతుంది. సీజన్ మారినప్పుడు వచ్చే దగ్గును చాలా సమర్ధవంతంగా తగ్గిస్తుంది.
ప్రతీరోజు నీళ్లలో తులసి ఆకులు వేసుకుని తాగాలి. ఇలా చేస్తే గొంతు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.
కూరకు పులుపు తక్కువైనట్లు అనిపిస్తే మార్కెట్లో దొరికే మామిడి పొడికి కొంచెం పెరుగు కలపండి. టొమాటో రుచి వస్తుంది.
కోడిగుడ్లు పెంకును జాగ్రత్తగా పరిశీలిస్తే గుడ్డు తాజాగా ఉందా లేదా అనేది చాలా సులభంగా తెలుసుకోవచ్చు. కోడి గుడ్డు పెంకు మంచి షైనింగ్ ఉంటే కోడి గుడ్లు తాజావి. పెంకు కాస్తా రంగు మారిందంటే నిల్వ కోడిగుడ్లని అర్ధం చేసుకోవాలి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

