Beauty TipsHealthhealth tips in telugu

జుట్టు రాలడం ఆగి, ఒత్తుగా పెరగాలా? వారానికి ఒక్కసారి ఈ జెల్ రాస్తే చాలు!

Hair Care Tips:ప్రస్తుత రోజుల్లో కాలుష్యం, ఒత్తిడి, పోషకాహార లోపం వల్ల జుట్టు రాలడం అనేది చాలా సాధారణ సమస్యగా మారింది. మార్కెట్లో దొరికే రసాయనాలతో కూడిన ప్రొడక్ట్స్ వాడి విసిగిపోయారా? అయితే మీ జుట్టును సహజంగా కాపాడుకోవడానికి ఈ అద్భుతమైన జెల్ బాగా సహాయపడుతుంది.

వారంలో కేవలం ఒక్కసారి ఈ హోమ్ మేడ్ జెల్‌ను మీ కురులకు అప్లై చేస్తే చాలు.. జుట్టు రాలడం ఆగిపోయి, నల్లగా, ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. మరి ఆ మ్యాజికల్ జెల్ ఎలా తయారు చేయాలో ఈ ఆర్టికల్‌లో వివరంగా చూద్దాం.

ఈ Gel వారంలో 1 సారి రాస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది.. జుట్టు రాలే సమస్య అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా కనపడుతుంది. వయస్సుతో సంబందం లేకుండా చాలా చిన్న వయస్సులోనే రావటం వలన కంగారు పడి మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. వాటి వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.

మన వంటింటిలో ఉండే మెంతులు జుట్టు రాలకుండా చాలా బాగా సహాయపడుతుంది. మెంతులను పురాతన కాలం నుండి జుట్టు సంరక్షణలో వాడుతున్నారు. మెంతులను వేగించకుండా మెత్తని పొడిగా తయారుచేసుకోవాలి. మెంతుల పొడి మార్కెట్ లో కూడా లభ్యం అవుతుంది. రాత్రి సమయంలో రెండు స్పూన్ల మెంతి పిండిని నీటిని పోసి బాగా కలిపి అలా వదిలేయాలి.

మరుసటి రోజు ఉదయం మెంతి పిండిలో ఇంకా కొన్ని నీటిని పోసి బాగా కలిపి పలుచని వస్త్రం సాయంతో వడకట్టాలి. ఇలా చేయటం వలన Gel తయారవుతుంది. ఈ Gel ని వారానికి ఒకసారి జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించాలి. నూనె రాసిన జుట్టుకు రాయకూడదు. అరగంట అయ్యాక సాదరణమైన నీటితో తలస్నానం చేయాలి.

మరుసటి రోజు ఉదయం కుంకుడు కాయలతో లేదా షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి ఒక సారి నెల రోజుల పాటు చేస్తే చాలా మంచి ఫలితం కనపడుతుంది. మెంతులలో ఉన్న లక్షణాలు జుట్టు రాలకుండా ఒత్తుగా,పొడవుగా పెరగటానికి ప్రోత్సాహాన్ని అందిస్తాయి. అలాగే తల మీద చర్మం మీద ఇన్ ఫెక్షన్ లేకుండా చేస్తుంది.

జుట్టుకి మంచి కండిషనర్ గా పనిచేస్తుంది. అలాగే చుండ్రు సమస్య లేకుండా చేస్తుంది. జుట్టు డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. తెల్లజుట్టును నల్లగా మార్చటంలో కూడా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఒక్క మెంతులను ఉపయోగించి జుట్టు రాలే సమస్య,చుండ్రు సమస్య నుండి చాలా సమర్ధవంతంగా బయట పడవచ్చు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."