Healthhealth tips in telugu

నోటి పూతను త్వరగా తగ్గించే అద్భుతమైన ఇంటి వైద్యం.. అశ్రద్ధ అస్సలు వద్దు.

Mouth Ulcers Home Remedies : నోటి పూత వల్ల కనీసం నీళ్లు కూడా తాగలేక, భోజనం చేయలేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారా? పదే పదే వచ్చే ఈ సమస్యను చిన్నదే కదా అని అస్సలు అశ్రద్ధ చేయకండి! మీ ఇంట్లోనే ఉండే వస్తువులతో నోటి పూతను చిటికెలో మాయం చేసే ఒక అద్భుతమైన చిట్కా ఉంది. ఆ రెమెడీ ఏంటి? దాన్ని ఎలా వాడాలో ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి!

నోటి పూత సమస్య వచ్చిందంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏమి తినాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే నోటి పూత సమస్యను అసలు అశ్రద్ద చేయకూడదని నిపుణులు చెప్పుతున్నారు. సమస్య చిన్నగా ఉన్నప్పుడే సమస్య నుండి బయట పడటానికి ప్రయత్నాలు చేయాలి. మన వంటింటిలో ఉండే కొన్ని వస్తువులు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

పసుపు నోటి పూత సమస్యను తగ్గించటంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. పసుపులో యాంటీ ఇన్ ఫ్లెమేటరీ, యాంటీ బయోటిక్ లక్షణాలు సమృద్దిగా ఉండటం వలన నోటి పూతను తగ్గిస్తుంది. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో పావు స్పూన్ లో సగం పసుపు వేసి బాగా కలిపి ఆ నీటిని నోటిలో పోసుకొని పుక్కిలించాలి.

ఈ విధంగా రోజులో మూడు సార్లు చేస్తే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. అలాగే తీసుకొనే ఆహారంలో కూడా పసుపు ఉండేలా చూసుకోవాలి. అలాగే ఈ చిట్కాతో పాటు మరో చిట్కాను కూడా ఫాలో అయితే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. నోటి పూత ఉన్న ప్రదేశంలో నెయ్యి రాయాలి. ఈ విధంగా రోజులో మూడు సార్లు రాస్తే సరిపోతుంది.

ఇలా నెయ్యి రాస్తూ పసుపు నీటిని పుక్కిలిస్తూ ఉంటే కేవలం మూడు రోజుల్లో నోటి పూత సమస్య మాయం అవుతుంది. ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."