Beauty TipsHealthhealth tips in telugu

జుట్టు విపరీతంగా రాలుతోందా? అయితే ఈ అద్భుత చిట్కాలతో వెంటనే చెక్ పెట్టండి!

Hair Care Tips:రోజురోజుకూ దువ్వెన నిండా జుట్టు ఊడిపోతోందని టెన్షన్ పడుతున్నారా? కాలుష్యం, ఒత్తిడి, సరైన పోషకాహారం లేకపోవడం వల్ల ఈ రోజుల్లో హెయిర్ ఫాల్ అనేది పెద్ద సమస్యగా మారింది.

ఖరీదైన ట్రీట్మెంట్స్, రసాయనాలతో కూడిన ప్రొడక్ట్స్ వాడే బదులు.. మన ఇంట్లోనే దొరికే సహజమైన వస్తువులతో ఈ సమస్యకు శాశ్వతంగా ఎలా చెక్ పెట్టవచ్చో ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకుందాం.

జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటోందా..తగ్గేందుకు ఏం చేయాలంటే..మారిన జీవనశైలి పరిస్థితులు, వాతావరణంలో కాలుష్యం కారణంగా జుట్టుకు సంబంధించిన ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి.

చాలామంది జుట్టు రాలే సమస్య., చుండ్రు సమస్యలు వచ్చినప్పుడు మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. ఇంటిలో దొరికే .సహజ సిద్ధమైన పదార్థాలతో జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు.

చిన్న ఉల్లిపాయన పేస్టుగా తయారు చేసుకోవాలి. ఒక బౌల్ లో ఉల్లిపాయ పేస్ట్, రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్, ఒక స్పూన్ ఆముదం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించాలి. జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకూ పట్టించాలి. ఒక అరగంట అలా వదిలేయాలి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. .

ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టుకి సంబంధించిన సమస్యలు జుట్టురాలే సమస్య, చుండ్రు వంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. అంతే కాకుండా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. ఉల్లిపాయ చర్మంలో రక్త ప్రసరణను పెంచి జుట్టు పెరుగుదల మరియు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

బాదం నూనెలో ఉండే లక్షణాలు జుట్టు బలంగా మృదువుగా మెరవడానికి సహాయపడతాయి. ఆముదంను పురాతన కాలం నుండి జుట్టు సంరక్షణలో ఉపయోగి స్తున్నారు. ఈ మిశ్రమం చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు రాలే సమస్యను, చుండ్రును తగ్గించుకోవచ్చు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."