Beauty TipsKitchenvantalu

కొబ్బరి పీచుతో ఇంట్లో ఇన్ని లాభాలు ఉన్నాయా? తెలిస్తే ఇకపై అస్సలు పడేయరు!

Coconut Husk Fiber: కొబ్బరి కాయ కొట్టాక అందులో ఉండే పీచును వేస్ట్ అని చెత్తబుట్టలో పడేయడం మనలో చాలామందికి అలవాటు. కానీ, ఆ కొబ్బరి పీచులో దాగి ఉన్న అద్భుతమైన ఉపయోగాలు తెలిస్తే మీరు షాక్ అవుతారు!

వంటగదిలో మురికి పట్టిన గిన్నెలు తోముకోవడం దగ్గరి నుండి, కుండీలలో మొక్కలు ఏపుగా పెరిగేలా చేసే వరకు దీని ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. మరి ఇకపై కొబ్బరి పీచును పడేయకుండా మన ఇంట్లో ఎలా వాడుకోవచ్చో ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకుందాం.

కొబ్బరి పీచును పాడేస్తున్నారా.. ఈ విషయం తెలిస్తే..అసలు వదిలిపెట్టరు..కొబ్బరి పీచును ఎన్ని రకాలుగా వాడవచ్చో తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. కొబ్బరి పీచును బ్రెజిల్‌లోని అనేక ప్రాంతాల్లో ఔషదంగా వాడతారు. డయేరియా, అతిసారం,జీర్ణ సమస్యలకు ఔషదంగా వాడతారు.

కొబ్బరి పీచును బాగా శుభ్రం చేసి.. నీటిలో వేసి మరిగించి.. ఆ నీటిని వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఈ విధంగా తాగితే డయేరియా, అతిసారం,జీర్ణ సమస్యలకు ఉపశమనం కలుగుతుంది.

కీళ్ళనొప్పులు ఉన్నవారు ఈ నీటిని తాగితే ఉపసమనం కలుగుతుంది. కొబ్బరి పొట్టులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. చలికాలంలో కీళ్ళనొప్పుల బాధ ఎక్కువగా ఉంటుంది.

పసుపు రంగులోకి మారిన దంతాలను తెల్లగా మారుస్తుంది. ఒక బాణలిలో కొబ్బరిపీచు వేసి మీడియం మంట మీద వేయించాలి. నల్లగా మారిన తర్వాత మంటను ఆపివేయండి. దీనిని పొడిగా చేసి దంతాలను శుభ్రం చేయడానికి ఉపయోగిస్తే మీ దంతాలు ముత్యాల్లా తెల్లగా మారుతాయి.

కొబ్బరి పీచు వంటగదిలో పాత్రలను శుభ్రం చేయటానికి ఉపయోగించవచ్చు. ఇన్ని ఉపయోగాలు ఉన్న కొబ్బరి పీచును పాడేయకుండా వాడటానికి ప్రయత్నం చేయండి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."