Beauty TipsHealthhealth tips in telugu

ఈ చిన్న చిట్కాతో జుట్టు రాలడం ఆగిపోయి.. ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది!

Onion and rice Hair Fall Tips In Telugu : కాలుష్యం, పోషకాహార లోపం, పని ఒత్తిడి వల్ల ఈ రోజుల్లో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న అతి పెద్ద సమస్య జుట్టు రాలడం. తలస్నానం చేసినా, దువ్వెన పెట్టినా గుప్పెడు జుట్టు ఊడిపోతుంటే వచ్చే ఆందోళన అంతాఇంతా కాదు. మార్కెట్లో దొరికే ఖరీదైన షాంపూలు, నూనెలు వాడినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు.

అయితే, మన ఇంట్లోనే లభించే కొన్ని సహజసిద్ధమైన వస్తువులతో జుట్టు రాలే సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు. జుట్టు కుదుళ్లను దృఢంగా మార్చి, కురులు పట్టుకుచ్చులా ఒత్తుగా, నల్లగా, మరియు పొడవుగా పెరిగేలా చేసే ఆ అద్భుతమైన హెయిర్ కేర్ సీక్రెట్స్ ఏమిటో ఈ పోస్ట్‌లో వివరంగా తెలుసుకుందాం.

వాతావరణంలో కాలుష్యం,మారిన జీవనశైలి కారణంగా వయస్సుతో సంబంధం లేకుండా చాలా చిన్న వయస్సులోనే జుట్టుకి సంబందించిన సమస్యలు వస్తున్నాయి. జుట్టు సమస్యలను తగ్గించుకోవటానికి ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి.

జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే మనలో చాలా మంది కంగారూ పడిపోయి మార్కెట్ లో దొరికే రకరకాల పొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. దాని వల్ల తాత్కాలికంగా ఫలితం ఉన్నా కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా ఇంటిలో ఉండే సహజ సిద్దమైన పదార్ధాలతో జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు.

మూడు స్పూన్ల బియ్యాన్ని నీటిలో మూడు గంటల పాటు నానబెట్టి ఆ నీటిని వడకట్టి పక్కన పెట్టాలి. ఒక బౌల్ లో 2 స్పూన్ల ఉల్లిపాయ రసం, ఒక స్పూన్ కాఫీ పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బియ్యం నీటిలో వేసి బాగా కలపాలి. ఆ తర్వాత దీనిలో మనం రెగ్యులర్ గా వాడే షాంపూ వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమంతో వారంలో రెండు సార్లు తల రుద్దుకుంటే జుట్టు రాలే సమస్య తగ్గటమే కాకుండా జుట్టు కుదుళ్లకు పోషణ అంది జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరుగుతుంది. ఈ చిట్కా చాలా బాగా సహాయపడుతుంది.బియ్యం నీటిని జుట్టు సంరక్షణలో పూర్వ కాలం నుండి ఉపయోగిస్తున్నారు. బియ్యం నీటిలో ఉండే పోషకాలు జుట్టు రాలే సమస్యను అత్గ్గిస్తాయి.

ఉల్లిరసంలో ఉండే పోషకాలు తల మీద చర్మం మీద ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ లేకుండా చేస్తుంది. దాంతో చుండ్రు సమస్య కూడా ఉండదు. జుట్టు రాలటానికి చుండ్రు కూడా ఒక ముఖ్యమైన కారణంగా చెప్పవచ్చు. కాఫీ పొడి జుట్టు ముదురు రంగులో ప్రకాశవంతంగా మెరవటానికి సహాయ పడుతుంది. షాంపూ తల మీద దుమ్ము,ధూళి తొలగించటంలో సహాయపడుతుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."