Beauty TipsHealthhealth tips in telugu

ముఖంపై నల్ల మచ్చలు వేధిస్తున్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో నిగనిగలాడే చర్మం మీ సొంతం!

Face Glow Tips:ముఖం ఎంత అందంగా ఉన్నా, ఒకటి రెండు నల్ల మచ్చలు కనిపిస్తే చాలు.. ఆ అందం కాస్తా తగ్గిపోయినట్లు అనిపిస్తుంది. ఎండ ప్రభావం, కాలుష్యం లేదా మొటిమల వల్ల వచ్చే ఈ డార్క్ స్పాట్స్‌ను వదిలించుకోవడానికి ఎన్నో క్రీమ్స్ వాడి విసిగిపోయారా?

అయితే మీకోసమే ఈ న్యాచురల్ హోమ్ రెమెడీస్. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, మన ఇంట్లోనే దొరికే వస్తువులతో నల్ల మచ్చలకు సులభంగా ఎలా చెక్ పెట్టవచ్చో ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకుందాం.

చర్మంపై నల్ల మచ్చలు చికాకు పెడుతున్నాయా.. అయితే ఈ సింపుల్‌ టిప్స్‌ మీ కోసమే..చర్మం మీద ఎటువంటి మచ్చలు లేకుండా అందంగా తెల్లగా మెరవటానికి ఎటువంటి క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు.

ఇంటిలో దొరికే సహజసిద్దమైన వస్తువులతో సులభంగా తగ్గించుకోవచ్చు. దీని కోసం ఒక పొడిని తయారుచేసుకోవాలి. ఈ పొడి కోసం ముందుగా క్యారెట్,కీరా దోసను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఈ ముక్కలను మిక్సీలో వేసి జ్యూస్ గా తయారుచేసుకోవాలి. ఈ జ్యూస్ ని గిన్నెలో పోసి పొయ్యి మీద పెట్టి పది నిమిషాల పాటు మరిగించాలి. ఈ జ్యూస్ చల్లారాక బియ్యం పిండిని వేసి బాగా కలిపి ఎండలో బాగా ఎండబెట్టాలి. బాగా ఎండిన ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని నిల్వ చేసుకోవచ్చు.

ఒక బౌల్ లో ఒక స్పూన్ తయారుచేసుకున్న పొడి,ఒక స్పూన్ టమోటా జ్యూస్,ఒక స్పూన్ రోజ్ వాటర్,చిటికెడు పసుపు వేసి అన్నీ బాగా కలిసేలా కలిపి ముఖానికి రాసి ఆరాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో మూడు సార్లు చేస్తూ ఉంటే ముఖం మీద నల్లని మచ్చలు,మొటిమలు అన్నీ తొలగిపోతాయి.

చర్మ సమస్యల కోసం ఖరీదైన క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు. చాలా తక్కువ ఖర్చులో ఇంటిలో సహజసిద్దమైన పదార్ధాలతో సులభంగా తగ్గించుకోవచ్చు. ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా మంచి ఫలితం వస్తుంది. కాస్త ఓపిక సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."