Kitchenvantalu

క్యారెట్, టమాటోలతో కమ్మని పచ్చడి.. వేడి వేడి అన్నంలోకి అదిరిపోయే రుచి!

Carrot Tomato Pachadi:ప్రతిరోజూ ఒకే రకమైన పచ్చళ్లు తిని బోర్ కొట్టిందా? అయితే కాస్త వెరైటీగా, ఎంతో ఆరోగ్యకరమైన ‘క్యారెట్ టమాటో పచ్చడి’ (Carrot Tomato Pachadi) ట్రై చేసి చూడండి. క్యారెట్ అనగానే మనం సాధారణంగా ఫ్రై లేదా హల్వా చేసుకుంటాం. కానీ క్యారెట్ కు కాస్త టమాటో, పచ్చిమిర్చి జోడించి చేసే ఈ రోటి పచ్చడి రుచి వర్ణించలేము.

క్యారెట్‌లో కంటికి మేలు చేసే విటమిన్-ఎ, టమాటోలో రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్-సి పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకుని తిన్నా, లేదా ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ, దోశల్లోకి నంజుకున్నా దీని టేస్ట్ అద్భుతంగా ఉంటుంది.

మరి ఎంతో కమ్మగా ఉండే ఈ క్యారెట్ టమాటో పచ్చడిని ఇంట్లోనే పది నిమిషాల్లో సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకుందాం. మీ ఇంట్లో వాళ్లకు ఈ పచ్చడి రుచి చూపించండి, మళ్లీ మళ్లీ అడిగి మరీ చేయించుకుంటారు!

క్యారెట్ టమాటో పచ్చడి.. కంటికి మేలు చేసే క్యారెట్ తో పచ్చడి చేసేద్దాం. తియ్యని క్యారట్ కి పుల్లని టమాటోలు మిక్స్ చేసి రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
క్యారేట్స్ – 3
టమాటోలు – 2
వెల్లుల్లి రెబ్బలు – 7-8
జీలకర్ర – 1 టీ స్పూన్
ధనియాలు – 1 టేబుల్ స్పూన్
ఎండుమిర్చి – 2
నువ్వులు – 1 ½ టేబుల్ స్పూన్
చింతపండు – 10 గ్రాములు
ఉప్పు – రుచికి సరిపడా
తాలింపులు – తగినన్ని

తయారీ విధానం
1.ముందుగా టమాటోలు ,క్యారేట్ తొక్క తీసుకోని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని ఆయిల్ వేడి చేసి అందులోకి ధనియాలు ,ఎండుమిర్చి,నువ్వులు,జీలకర్ర వేసి వేపుకోని ప్లేట్ లోకి తీసుకోవాలి.
3.అదే ప్యాన్ లో మరో టీ స్పూన్ ఆయిల్ వేసి అందులోకి క్యారేట్ తురుము వేసి రెండు మూడు నిమిషాలు వేపుకోవాలి.
4. క్యారెట్ వేగాక అందులోకి టమాటో ముక్కలు వేసి మెత్తపడే వరకు మగ్గించుకోవాలి.
5.ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోని మిశ్రమాన్ని చల్లరనివ్వాలి.

6.ఇప్పుడు మిక్సి జార్ లోకి వేపుకున్న పప్పు దినుసులను వేసి అందులోకి వెల్లుల్లి రెబ్బలు,పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.
7.ఇప్పుడు అందులోకి క్యారెట్ ,టమాటో ముక్కలను వేసి చింతపండు గుజ్జును యాడ్ చేసి తగినంత ఉప్పును వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
8.ఇప్పుడు తాలింపు కోసం ప్యాన్ లో ఆయిల్ వేడి చేసి అందులోకి తాలింపు గింజలు,ఎండు మిర్చి,కరివేపాకు,పసుపు వేసి వేగిన తాలింపులో గ్రైండ్ చేసుకున్న క్యారెట్ ,టమాటో పేస్ట్ ని వేసి మిక్స్ చేసుకోవాలి.
9.అంతే క్యారట్,టమాటో చట్నీ రెడీ.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."