Healthhealth tips in telugu

ఎముకల బలానికి, బీపీ షుగర్ కంట్రోల్‌కి.. పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ ఇదే!

Jowar Flakes Healthy Breakfast : ఉరుకుల పరుగుల జీవితంలో సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల పిల్లల్లో ఎముకల బలహీనత, పెద్దల్లో బీపీ, షుగర్, మలబద్ధకం వంటి సమస్యలు ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయాయి. అయితే మనం రోజు ఉదయం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌లో చిన్న మార్పు చేయడం ద్వారా వీటన్నింటికీ సులభంగా చెక్ పెట్టవచ్చు.

ఇంట్లోనే లభించే సహజసిద్ధమైన పదార్థాలతో తయారుచేసుకునే ఒక అద్భుతమైన ‘హెల్తీ బ్రేక్‌ఫాస్ట్’ గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. ఇది పిల్లలు, పెద్దల్లో ఎముకలను దృఢంగా మార్చడమే కాకుండా, జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి మలబద్ధకం దరిచేరకుండా చేస్తుంది.

అంతేకాకుండా డయాబెటిస్, బీపీ ఉన్నవారికి షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్‌లో ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఆ సూపర్ బ్రేక్‌ఫాస్ట్ ఏంటి? దాన్ని రుచిగా ఎలా తయారు చేసుకోవాలి? అనే పూర్తి వివరాలు ఇక్కడ చూసేయండి!

డయాబెటిస్, రక్తపోటు నియంత్రణలో ఉంచటమే కాకుండా జీర్ణశక్తిని పెంచి మలబద్దకంను తగ్గించి ఎముకలను బలంగా చేసి రోజంతా హుషారుగా ఉండేలా చేసే simple Breakfast గురించి తెలుసుకుందాం. ఈ Breakfast ని వారంలో రెండు సార్లు తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
Jonna Atukulu
ఒక కప్పు జొన్న అటుకులను పాన్ లో వేసి పచ్చి పోయే వరకు వేగించాలి. జొన్న అటుకులను ఒక బౌల్ లో వేయాలి. కాస్త చల్లారాక రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసి పెరుగు కలపాలి. ఆ తర్వాత 5 నిమిషాల పాటు అలా వదిలేయలి. ఆ తర్వాత పొయ్యి వేలిగించి పాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి లేదా నూనె వేయాలి.

నూనె కొంచెం వేడి అయ్యాక అరస్పూన్ ఆవాలు,ఒక స్పూన్ పచ్చి శనగపప్పు,ఒక స్పూన్ మినపప్పు,పావు స్పూన్ జీలకర్ర,కచ్చా పచ్చాగా దంచిన పావు స్పూన్ మిరియాలు, రెండు స్పూన్ల పచ్చిమిర్చి ముక్కలు, ఒక స్పూన్ అల్లం ముక్కలు, ఒక ఎండుమిర్చి వేసి బాగా వేగాక కరివేపాకు,ఇంగువ వేసి బాగా కలపాలి.

పెరుగు కలిపిన జొన్నల మిశ్రమంలో తాలింపు వేసుకొని బాగా కలపాలి. జొన్న అటుకులతో తయారుచేసుకున్న దద్దోజనము ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకుంటే రోజంతా అలసట లేకుండా హుషారుగా ఉంటారు. అలాగే తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి జీర్ణ సంబంద సమస్యలు ఏమి ఉండవు.

మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. కాస్త ఓపికగా ఇటువంటి మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవటం అలవాటు చేసుకోవాలి. జొన్న అటుకులు సూపర్ మార్కెట్ లోనూ,Online stores లోనూ విరివిగానే లభ్యం అవుతున్నాయి. కాబట్టి పెరుగుతో కలిపి ఈ విధంగా చేసుకొని తినండి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."