ముఖం తెల్లగా.. మెడ నల్లగా ఉందా? ఈ సింపుల్ ఇంటి చిట్కాలతో నలుపును సులభంగా వదిలించుకోండి!
Neck black tips :మనం ముఖం అందంగా కనిపించడానికి తీసుకునే శ్రద్ధ, మెడ విషయంలో తీసుకోము. దీనివల్ల ముఖం తెల్లగా మెరిసిపోతున్నా.. మెడ చుట్టూ మాత్రం నల్లటి మచ్చలు, మురికి పేరుకుపోయి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది.
బయటకు వెళ్లినప్పుడు మన కాన్ఫిడెన్స్‌ను దెబ్బతీసే ఈ సమస్యను వదిలించుకోవడానికి ఖరీదైన క్రీమ్స్ కొనాల్సిన పనేలేదు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, మన వంటింట్లో దొరికే వస్తువులతోనే మెడపై ఉన్న నలుపును ఎలా మాయం చేయవచ్చో ఇప్పుడు చూద్దాం.

మిగతా శరీర బాగాలు ఎలా ఉన్న కొందరికి మెడ చుట్టూ నల్లగా ఉంటుంది. నగలు వేసుకొనేటప్పుడు,లో నేక్ దుస్తులు వేసుకొనే టప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మరి ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే ఇంటిలో మనకు సులభంగా అందుబాటులో ఉండే కొన్ని పదార్దాలతో చెక్ పెట్టవచ్చు.
బాదంలో లభించే విటమిన చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. మెడ చుట్టూ నలుపును తగ్గించుకోవటానికి అరస్పూన్ బాదం పొడిలో ఒక స్పూన్ పాల పొడి,ఒక స్పూన్ తేనే కలపాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం సేపు ఫ్రిడ్జ్ లో ఉంచి తీసి మెడకు రాసుకొని మర్దన చేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
కలబంద చర్మానికి తేమను అందించటంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. ప్రతి రోజు కలబంద గుజ్జును మెడకు ప్యాక్ వేసుకోవాలి. ఇరవై నిముషాలు మృదువుగా మర్దన చేసి చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

