Beauty TipsHealthhealth tips in telugu

మీ చర్మం పట్టులా మెరవాలంటే… బ్రౌన్ షుగర్‌తో ఇలా ఒకసారి చేసి చూడండి!

Brown Sugar For Skin:ప్రతి ఒక్కరూ కాంతివంతమైన, మృదువైన చర్మం కావాలని కోరుకుంటారు. కానీ కాలుష్యం, మృతకణాల వల్ల చర్మం తన సహజ నిగారింపును కోల్పోతుంది. ఖరీదైన క్రీమ్స్ వాడి విసిగిపోయారా? అయితే మీ వంటగదిలో ఉండే ‘బ్రౌన్ షుగర్’ మీ చర్మానికి మంచి బ్యూటీ ప్రొడక్ట్ లా పనిచేస్తుందని మీకు తెలుసా?

బ్రౌన్ షుగర్‌ చర్మాన్ని లోపలి నుండి శుభ్రం చేసి, తేమను అందించి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. మరి ఈ బ్రౌన్ షుగర్‌తో ఎలాంటి ఫేస్ ప్యాక్స్ తయారు చేయాలి? దాని అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం!

బ్రౌన్ షుగర్ అంటే ముడి చక్కెర. మనం ప్రతిరోజు చక్కెరను ఏదో రకంగా వాడుతూనే ఉంటాం. కాఫీ టీ పాలు జ్యూస్ వీటిల్లో వేసుకుని తీసుకుంటూ ఉంటాం.

ఇటీవల కాలంలో వైట్ చక్కెర మంచిది కాదని బ్రౌన్ షుగర్ వాడటం మొదలు పెట్టారు. వైట్ షుగర్ తో పోలిస్తే బ్రౌన్ షుగర్ ఆరోగ్యానికి కూడా మంచిది. ఆరోగ్యానికే కాకుండా బ్యూటీ ప్రయోజనాలు కూడా ఉన్నాయి.ముఖం జిడ్డు లేకుండా కాంతివంతంగా ఉండాలి అంటే బ్రౌన్ షుగర్ బాగా సహాయపడుతుంది.

బ్రౌన్ షుగర్ ని పొడిచేసి దానిలో కొంచెం బియ్యప్పిండి కొంచెం పాలు వేసి బాగా కలిపి ముఖానికి పట్టించాలి అరగంట అయ్యాక చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.

చర్మంపై మృతకణాలు తొలగిపోయి ఉంటే ఈ ప్యాక్ ఫాలో అవ్వాలి బ్రౌన్ షుగర్ పొడిలో కొంచెం తేనె కలిపి ముఖానికి పట్టించి నిదానంగా రబ్ చేయాలి . అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Brown sugar face scrub in Telugu, బ్రౌన్ షుగర్ బ్యూటీ టిప్స్, Glowing skin tips in Telugu, Natural scrub for soft skin, Telugu beauty care tips, మృదువైన చర్మం కోసం చిట్కాలు, Exfoliation tips in Telugu.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."