Kitchenvantalu

ఇంట్లో కూరగాయలు లేవా? అయితే 5 నిమిషాల్లో ఈ రుచికరమైన ‘పిండి చారు’ చేసి చూడండి!

Besan Flour Sambar Recipe:అన్నం, ఉప్మా, టిఫిన్స్ లోకి, జారుగా తయారు చేసుకున్న, శనగపిండి చారు సూపర్ కాంబో, శనగపిండి చారును ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.

రోజూ ఒకే రకం కూరలు, పప్పులు తిని బోర్ కొట్టిందా? ఇంట్లో కూరగాయలు కూడా ఏమీ లేవా? అయితే ఏమాత్రం ఆలోచించకుండా చిటికెలో చేసుకోగలిగే పాతకాలం నాటి కమ్మని రెసిపీ ‘పిండి చారు’.

నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు, జ్వరంగా ఉండి నోరు చేదుగా ఉన్నప్పుడు ఈ వేడివేడి పిండి చారును అన్నంలో కలుపుకుని తింటే అమృతంలా ఉంటుంది. తక్కువ పదార్థాలతో, అతి తక్కువ సమయంలో ఎంతో రుచిగా ఈ పిండి చారుని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్ధాలు
శనగపిండి – 2 టేబుల్ స్పూన్స్
ఉల్లిపాయలు – 2
టమాటాలు – 3
పచ్చిమిర్చి – 3
చింతపండు – 20 గ్రాములు
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్
ఆవాలు – 1 టీ స్పన్
జీలకర్ర – 1/2టీ స్పూన్
పసుపు – 1/2టీ స్పూన్
కారం – 1 టీ స్పూన్
కొత్తిమీర – 1/4కప్పు
సాంబార్ పొడి – 1 టేబుల్ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – తగినంత

తయారీ విధానం
1.స్టౌ పై పాన్ పెట్టుకుని, హాఫ్ టేబుల్ స్పూన్ నూనె వేసుకుని, అందులోకి, ఆవాలు, జీలకర్ర, మెంతులు, వేసి వేపుకోవాలి.
2.అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి మెత్తపడనివ్వావి.
3.ఇప్పుడు అందులోకి, పచ్చిమిర్చి, కరివేపాకు, పసపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసి, ఒక నిముషం పాటు వేయించుకోవాలి.
4. ఉల్లిపాయలు మెత్తపడిన తర్వాత టమాటాలను యాడ్ చేసి మగ్గనివ్వాలి.

5.మగ్గిన టమాటాల్లో కారం, ఉప్పు, చింతపండు, రసం, వేసి నాలుగు నిముషాలు మరగనివ్వాలి.
6. వేరొక గిన్నెలో శనగపిండి, రెండు కప్పుల నీళ్లతో ముద్దలు లేకుండా కలుపుకుని, మరుగుతున్న చారులో నిదానంగా కలుపుకోవాలి.
7.ఇప్పుడు శనగచారులో సాంబార్ పొడి వేసి మరి కాసేపు మరిగించుకోవాలి.
8. చివరగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
Pindi charu recipe in Telugu, పిండి చారు తయారీ విధానం, No vegetable recipes Telugu, Instant rasam recipe, Quick lunch recipes in Telugu, Traditional Andhra recipes, శనగపిండి చారు, Besan charu Telugu.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."