దువ్వెన నిండా జుట్టేనా? పార్లర్ ఖర్చు లేకుండా ఇంట్లోనే హెయిర్ ఫాల్ కు శాశ్వతంగా చెక్ పెట్టండి!
Rice Hair fall Tips In Telugu :వాతావరణ కాలుష్యం, పోషకాల లోపం, ఒత్తిడి.. కారణం ఏదైనా ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న అతిపెద్ద సమస్య హెయిర్ ఫాల్. రాలిపోతున్న జుట్టును చూసి ఆందోళన చెందుతూ, మార్కెట్లో దొరికే రకరకాల కెమికల్ ప్రొడక్ట్స్ వాడుతూ జుట్టును మరింత పాడుచేసుకుంటున్నారు.
కానీ మన ఇంట్లో దొరికే సామాన్యమైన వస్తువులతోనే జుట్టు రాలడాన్ని అద్భుతంగా అరికట్టవచ్చని మీకు తెలుసా? పైసా ఖర్చు లేకుండా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆ నాచురల్ హోమ్ రెమెడీస్ ఏంటి? వాటిని ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం.
జుట్టుకి సంబందించిన సమస్యలు వచ్చినప్పుడు అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందికి జుట్టు రాలే సమస్య వస్తోంది. కొంతమందికి అయితే బట్టతల వచ్చేస్తోంది.
జుట్టు పొడవుగా పెరగడానికి ఒక మంచి చిట్కా తెలుసుకుందాం. జుట్టుకి సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది. జుట్టు ఒత్తుగా మెరుస్తూ ఉంటుంది. ఈ రెమిడీ కోసం కేవలం రెండు ఇంగ్రీడెంట్స్ మాత్రమే ఉపయోగిస్తున్నాం.

ముఖం అందంగా ఉండాలి అంటే జుట్టు కూడా ఒక కీలకమైన పాత్రను పోషిస్తుంది. జుట్టు ఒత్తుగా పొడవుగా ఉంటే ఆ అందమే వేరు కాబట్టి ప్రతి ఒక్కరూ జుట్టు ఒత్తుగా పొడవుగా ఉండాలని కోరుకుంటారు. ఈ రెమిడీ చేయటం చాలా సులువు. కాస్త సమయం,శ్రద్ద పెడితే సరిపోతుంది.
ఈ రెమిడీ కోసం ఒక బౌల్ లేదా ఒక గాజు సీసాలో 3 స్పూన్ల బియ్యం, 5 లవంగాలను వేసి నీటిని పోసి మూత పెట్టి రాత్రంతా అలా వదిలేయలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడకట్టి తలకు పట్టించి గంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి.
ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే జుట్టు రాలే సమస్య క్రమంగా తగ్గి జుట్టు కుదుళ్లు బలపడి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. బియ్యం నీరు జుట్టుకి కండిషనర్ గా కూడా పనిచేస్తుంది. లవంగాలులో ఉన్న పోషకాలు జుట్టు రాలకుండా చేస్తాయి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com
Hair fall control tips in Telugu, జుట్టు రాలకుండా చిట్కాలు, Home remedies for hair loss, Telugu hair care tips, Natural hair growth tips, ఇంట్లో దొరికే వస్తువులతో జుట్టు సంరక్షణ.

