Beauty TipsHealthhealth tips in telugu

బ్యూటీ పార్లర్‌కు వెళ్లే టైమ్ లేదా? ఇంట్లోనే ముఖాన్ని ఇలా మెరిపించుకోండి!

Besan Face Glow Tips In telugu :బ్యూటీ పార్లర్‌కు వెళ్లడానికి సమయం దొరకట్లేదా? ఇంట్లో ఉండే సహజమైన పదార్థాలతోనే మీ ముఖాన్ని అందంగా, కాంతివంతంగా ఎలా మార్చుకోవాలో ఈ బ్లాగ్‌లో తెలుసుకోండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, తక్కువ టైమ్‌లో ఫేస్ గ్లో (Face Glow) రావడానికి బెస్ట్ హోమ్ రెమెడీస్ మీకోసం!

ముఖ సంరక్షణలో శనగపిండిని పురాతన కాలం నుండి వాడుతున్నారు. శనగపిండి,నిమ్మరసం వంటివి ముఖం తెల్లగా మెరవటానికి సహాయపడుతుంది.

ఈ మధ్య కాలంలో అందం పట్ల శ్రద్ద ఎక్కువగా పెడుతున్నారు. ప్రతి ఒక్కరు ముఖం అందంగా,తెల్లగా మెరిసిపోవాలని కోరుకుంటారు. దాని కోసం ఎంత ఖర్చు పెట్టటానికి అయినా రెడీ అవుతారు. అయితే పెద్దగా ఖర్చు పెట్టకుండా ఇంటిలో సులభంగా ఉండే వస్తువులతో ముఖాన్ని తెల్లగా,కాంతివంతంగా మార్చుకోవచ్చు. దాని కోసం పెద్దగా కష్టపడవలసిన అవసరం లేదు.
besan
ముఖాన్ని తెల్లగా,కాంతివంతంగా చేయటానికి శనగపిండి బాగా హెల్ప్ చేస్తుంది. ఎలాంటి చర్మ తత్వానికి అయినా శనగపిండి సెట్ అవుతుంది. శనగపిండిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. ఒక స్పూన్ శనగపిండిలో సరిపడా నిమ్మరసం వేసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఈ పేస్ట్ ని ముఖానికి రాసి 2 నిముషాలు సున్నితంగా మసాజ్ చేసి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా చేయటం వలన చర్మంపై పేరుకుపోయిన మృతకణాలు తొలగి కాంతివంతంగా మారుతుంది. శ‌న‌గ‌పిండిలో చిటికెడు ప‌సుపు మ‌రియు పాలు వేసి బాగా కలిపి ముఖానికి రాసి 2 నిముషాలు సున్నితంగా మసాజ్ చేసి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయటం వలన ముఖంపై ఉన్న మొటిమలు మరియు నల్లని మచ్చలు అన్ని తొలగిపోతాయి.

శనగపిండిలో(besan flour) ఉండే జింక్ ముఖంపై వచ్చే మొటిమలు కారణమయ్యే ఇన్ఫెక్షన్లతో పోరాటం చేస్తుంది. అలాగే అదనపు జిడ్డు (సెబమ్) ఉత్పత్తిని నియంత్రించడంలో సహాయపడుతుంది. చర్మంపై తేమ ఉండేలా చేసి మృదువుగా,కాంతివంతంగా ఉండేలా చేస్తుంది. చర్మం లోపల నుండి దుమ్ము,ధూళిని తొలగిస్తుంది.

నిమ్మలో ఉన్న బ్లీచింగ్ లక్షణాలు ముఖం మీద నలుపును,మృత కణాలను తొలగించి ముఖం అందంగా కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. పాలల్లో ఉన్న పోషకాలు చర్మానికి పోషణ ,తేమను అందించి చర్మానికి ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. చర్మాన్ని మృదువుగా, సున్నితంగా ఉంచుతాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."