Beauty TipsHealthhealth tips in telugu

తెల్ల జుట్టు సమస్యకు చెక్.. ఈ ఆయిల్‌తో మీ కురులు సహజంగా నల్లగా, నిగనిగలాడతాయి!

White Hair: వయసుతో సంబంధం లేకుండా చాలామందిని వేధిస్తున్న సమస్య తెల్ల జుట్టు (White Hair). దీనికోసం రసాయనాలతో కూడిన రంగులు వేసి జుట్టును పాడుచేసుకోకండి.

ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, కేవలం మన ఇంట్లో దొరికే సహజసిద్ధమైన వస్తువులతో ఒక పవర్ ఫుల్ ఆయిల్ తయారు చేసుకోవచ్చు. కురులను కుదుళ్ల నుంచి బలోపేతం చేసి, నల్లగా మెరిసేలా చేసే ఆ మ్యాజిక్ ఆయిల్ గురించి ఇప్పుడే చదివి తెలుసుకోండి.

తెల్లజుట్టు ఉందా? ఈ నూనెతో ఇలా చేస్తే నల్లగా నిగనిగలాడాల్సిందే..ఈ మధ్య కాలంలో జుట్టుకి సంబందించిన సమస్యలు చాలా వస్తున్నాయి. వాటిలో తెల్లజుట్టు సమస్య అనేది చాలా తరచుగా వినిపిస్తుంది.

తెల్లజుట్టు సమస్య చాలా చిన్న వయస్సులోనే రావటం వలన చాలా కంగారు పడి మార్కెట్ లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. అంతేకాక నలుగురిలోకి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది.

తెల్లజుట్టు నల్లగా మారటానికి మరియు తెల్లజుట్టు రాకుండా ఉండటానికి ఇప్పుడు చెప్పే నూనె వాడితే చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. ఒక గిన్నె లో 300 గ్రాముల కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె తీసుకోవాలి. ఆ తర్వాత దానిలో 100 గ్రాముల ఆలోవెరా జెల్,100 గ్రాముల గుంటగలగర ఆకు పొడి వేసి మరిగించాలి.

పది నిమిషాలు అయ్యాక 50 గ్రాముల గంధ కచ్చూరాలు పొడి వేసి మరో పది నిమిషాలు మరిగించి పొయ్యి ఆఫ్ చేసి చల్లారాక నూనెను వడకట్టి సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను ప్రతి రోజు జుట్టుకు రాస్తూ ఉండాలి. ఈ విధంగా రాయటం వలన తెల్లజుట్టు అనేది అసలు ఉండదు. ఒకవేళ తెల్లజుట్టు ఉంటే నల్లగా మారుతుంది.

ఈ నూనెలో ఉన్న పోషకాలు తెల్లజుట్టును నల్లగా మార్చటమే కాకుండా జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరగటానికి సహాయపడుతుంది. జుట్టుకి సంబందించిన సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. కాస్త ఓపికగా చేసుకుంటే ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."