Healthhealth tips in telugu

ఖర్చు లేకుండా బరువు తగ్గొచ్చు.. మొండి కొవ్వును కరిగించే అద్భుతమైన ఆకు ఇదే!

Hibiscus tea for weight loss In Telugu :బరువు తగ్గడానికి, పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగించడానికి ఏవేవో ఖరీదైన ప్రయత్నాలు చేస్తున్నారా? అయితే మన ఇంటి పెరట్లో, వంటగదిలో ప్రతిరోజూ మనం చూసే ఒక అద్భుతమైన ఆకు గురించి మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

ఈ ఆకులో ఉండే ఔషధ గుణాలు శరీరంలో పేరుకుపోయిన మొండి కొవ్వును వేగంగా కరిగించడమే కాకుండా, శరీరంలోని జీవక్రియల (Metabolism) రేటును పెంచుతాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజ సిద్ధంగా బరువు తగ్గించే ఆ ఆకు ఏమిటి? దాన్ని రోజూ ఉదయాన్నే ఎలా తీసుకోవాలి? అన్న పూర్తి వివరాలను ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకుందాం.

ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. బరువు పెరగటం అనేది సులువుగా జరిగిపోతుంది. బరువు తగ్గడం అనేది చాలా కష్టంగా జరుగుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం పెద్దగా ఉండదు.
Weight Loss tips in telugu
అయితే బరువు తగ్గించడంలో మందార ఆకులు చాలా బాగా సహాయపడుతాయి. మందార ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి గ్లాసు నీటిలో వేసి మరిగించి వడగట్టి తేనె కలిపి తీసుకోవాలి. ప్రతిరోజు ఇలా తీసుకుంటే శరీరంలో ఉన్న అనవసరమైన కొవ్వు కరిగిపోతుంది. అలాగే అలసట నీరసం నిస్సత్తువ అన్ని తొలగిపోయి తక్షణ శక్తి లభిస్తుంది.

మందార ఆకులలో యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.మందార ఆకు టీ LDL కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. దాని కంటెంట్ ధమనుల లోపలి భాగంలో పొరలు ఏర్పడకుండా నివారించడంలో సహాయపడుతుంది. తద్వారా మీ కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.

అలానే ఇది బాడీ టెంపరేచర్ ని కూడా మెయింటెన్ చేస్తుంది. రక్త నాళాల ద్వారా రక్త ప్రవాహం బాగా జరిగేలా చేసి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. ఈ సీజన్ లో వచ్చే జలుబు మరియు దగ్గును కూడా మందార ఆకులు నివారిస్తుంది. మందార ఆకులలో అనేక యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.

మీ శరీరంలో ఫ్రీ రాడికల్స్ తొలగించటానికి సహాయం చేయుట వలన వృద్ధాప్య ప్రక్రియ మందగిస్తుంది. దాదాపుగా ప్రతి ఇంటిలో మందార మొక్క ఉంటుంది. కాబట్టి మందార ఆకులను ఉపయోగించి ఇప్పుడు చెప్పిన అన్నీ రకాల ప్రయోజనాలను పొందటానికి ప్రయత్నం చేయండి. ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."