Beauty TipsHealthhealth tips in telugu

జుట్టు రాలడం ఆగి, ఒత్తుగా పెరగాలంటే మెంతులను ఇలా వాడి చూడండి.

Fenugreek For hair :వాతావరణ కాలుష్యం, పోషకాహార లోపం వల్ల జుట్టు రాలిపోతోందని బాధపడుతున్నారా? మార్కెట్లో దొరికే ఖరీదైన కెమికల్ ప్రొడక్ట్స్ కంటే మన వంటగదిలో ఉండే మెంతులు కురులకు ఎంతో మేలు చేస్తాయి.

మెంతులను సరైన పద్ధతిలో వాడితే చుండ్రు తగ్గి, జుట్టు కుదుళ్ల నుంచి బలంగా తయారై మోకాళ్ల వరకు వేగంగా పెరుగుతుంది. ఆ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ హోమ్ రెమెడీస్ ఏంటో ఇప్పుడే చదివి తెలుసుకోండి.

ఈ మధ్యకాలంలో మారిన జీవనశైలి, జుట్టుకు సరైన పోషణ లేకపోవడం, కెమికల్ ఎక్కువగా ఉన్న షాంపూలు, నూనెలు వాడటం, వాతావరణంలో కాలుష్యం వంటి అనేక రకాల కారణాలతో చుండ్రు, జుట్టు రాలే సమస్య చాలా ఎక్కువగా కనబడుతుంది.

చుండ్రు సమస్య వచ్చిందంటే తొందరగా తగ్గదు. చుండ్రు కారణంగా జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. అలాగే జుట్టు పొడిగా మారిపోతుంది. అందువలన చుండ్రు సమస్య రాగానే తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలి. ఇప్పుడు చెప్పే నూనెను వారం రోజులపాటు వాడితే చుండ్రు సమస్య నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు.

పొయ్యి మీద పాన్ పెట్టి ఒక గ్లాసు ఆవనూనె పోయాలి. నూనె కాస్త వేడి అయ్యాక ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ kalonji సీడ్స్, నాలుగు రెబ్బల కరివేపాకు, నాలుగు మందార ఆకులు, అరకప్పు ఉల్లి ముక్కలు వేసి ఏడు నుంచి పది నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ నూనెను వడగట్టాలి.

ఈ నూనె దాదాపుగా 15 రోజులు పాటు నిల్వ ఉంటుంది. ఈ నూనెను ఒక బాటిల్లో నింపుకొని నిలువ చేసుకోవచ్చు. ఈ నూనెను జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు రాసి రెండు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. అరగంట అయ్యాక కుంకుడుకాయలతో తల స్నానం చేయాలి.

ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే చుండ్రు, జుట్టు రాలే సమస్య అన్ని తొలగిపోతాయి. జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలకుండా ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది. అలాగే ఈ నూనెలో ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియన్స్ లో ఉన్న పోషకాలు జుట్టు సమస్యలను తగ్గించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."