బ్యూటీ పార్లర్ ఖర్చులకి చెక్.. ఒకే ఒక్క ఎగ్ వైట్ తో మీ ముఖం కచ్చితంగా మెరిసిపోతుంది
Face Glow Tips:ప్రతి ఒక్కరికీ తమ ముఖం అందంగా, కాంతివంతంగా మెరిసిపోవాలని ఉంటుంది. దీనికోసం బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతూ ఫేసియల్స్, బ్లీచ్ అంటూ వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు. అలాగే మార్కెట్లో దొరికే రసాయనాలతో కూడిన క్రీమ్స్ వాడి ఉన్న చర్మాన్ని మరింత పాడుచేసుకుంటారు.
కానీ, మన వంటింట్లో సులభంగా దొరికే ‘గుడ్డు తెల్లసొన’ (Egg White) తో ఎలాంటి ఖర్చు లేకుండానే సహజమైన గ్లో సొంతం చేసుకోవచ్చని మీకు తెలుసా?
ఎగ్ వైట్ చర్మానికి ఒక మ్యాజిక్ లా పనిచేస్తుంది. ఇందులోని ప్రోటీన్లు, విటమిన్లు చర్మాన్ని బిగుతుగా మార్చి ముడతలను తగ్గిస్తాయి. అలాగే మొటిమలు, మచ్చలు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ను తొలగించి ముఖానికి ఇన్ స్టంట్ గ్లో తీసుకురావడంలో గుడ్డు తెల్లసొన అద్భుతంగా సహాయపడుతుంది.
మరి ఈ ఎగ్ వైట్ ను ముఖానికి డైరెక్ట్ గా అప్లై చేయొచ్చా? దానికి ఏయే సహజ పదార్థాలను కలిపి ఫేస్ ప్యాక్ లా వేసుకుంటే ముఖం పాలలా మెరిసిపోతుందో ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం!
అందానికి వేలకు వేలు ఖర్చు పెట్టే బదులు ఎగ్ వైట్ తో ఇలా చేయండి… చాలా చక్కని పలితాన్ని పొందవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖం మెరుస్తుంది. కేవలం రూ 5 ఖర్చుతో ముఖం మీద ముడతలు పోవటమే కాకుండా చర్మం మృదువుగా మారుతుంది.

ఎగ్, పెరుగు, అవకాడో:
1 గుడ్డులోని తెల్లసొన, ఒక టేబుల్ స్పూన్ అవకాడో, అంతే మోతాదులో పెరుగు మిక్స్ చేయాలి. అన్నింటినీ బాగా మిక్స్ చేసి.. ముఖానికి, మెడకు పట్టించాలి. ఆరిన తర్వాత.. నీటితో శుభ్రం చేసుకోవాలి. అంతే.. చర్మానికి మాయిశ్చరైజర్ అంది.. స్మూత్ గా మారుతుంది.
ఎగ్, తేనె :
1 టేబుల్ స్పూన్ తేనె మిక్స్ చేయాలి. రెండింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత.. స్క్రబ్ చేసి శుభ్రం చేసుకోవాలి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్.. చర్మాన్ని బ్రైట్ గా మారుస్తాయి.
ఎగ్, అరటిపండు, ఆల్మండ్ ఆయిల్:
1ఎగ్ వైట్, 1 టేబుల్ స్పూన్ అరటిపండు గుజ్జు, కొన్ని చుక్కల ఆల్మండ్ ఆయిల్ కలపాలి. అన్నింటినీ మిక్సీలో వేసి బ్లెండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు పట్టించాలి. 30 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల.. చర్మంలో మలినాలు బయటకుపోయి.. చర్మానికి కొత్తమెరుపుని అందిస్తుంది. అలాగే.. ఏజింగ్ ప్రాసెస్ ని స్లోగా మారుస్తుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

